Samantha: అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప(Pushpa Movie). సుకుమార్ దర్శకుడు. ఇటీవల రిలీజైన ఈ చిత్రం బాక్సాపీస్ రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఇందులో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది సమంత. తాజాగా ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పై ప్రశంసల జల్లు కురిపించింది. పుష్పరాజ్ గా బన్నీ అదరగొట్టేశారని..నటుడిగా ఆయన స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమాను వీక్షించిన సమంత(Samantha) ఇన్ స్టా(Instagram)లో తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు. 'పుష్పలో బన్నీ తన నటనతో కట్టిపడేశారు. చిత్తూరు యాస నుంచి భుజాన్ని పైకి పెట్టే మేనరిజం వరకూ ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన అదరగొట్టేశారు. .. తన నటనతో ప్రతిక్షణం స్ఫూర్తినింపితే అలాంటి నటీనటులను నేను ఎల్లప్పుడూ ప్రేరణగా తీసుకుంటాను' అని సమంత అంది. దీని బన్నీ రిప్లై ఇస్తూ..''డియర్‌ సమంత. మీరు నాపై కురిపించిన ఈ ప్రశంసలకు ధన్యవాదాలు. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి'' అని అన్నారు. 


Also Read: Pushpa Item Song: ఆ ఐటమ్ సాంగ్‌కు సమంత ఒప్పుకోడానికి కారణమిదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook