Samantha makes Shocking statement after separation from Naga Chaitanya: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. సోషల్‌ మీడియాలోనూ (Social media) ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది సామ్‌. అయితే అప్పుడప్పుడు తన మనసులోని భావాల్ని, తన బాధల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంది సమంత (Samantha). అంతేకాదు.. మోటివేషనల్‌ కోట్స్‌ను (Motivational‌quotes) షేర్ చేస్తూ ఉంది అక్కినేని ఫ్యామిలీ మాజీ కోడలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే తన సినిమాలకు (Cinema) సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా పంచుకుంటూ ఉంటుంది సామ్. ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య గురించి డైరెక్ట్‌గా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.తాజాగా సామ్... చైతో విడిపోయాక.. విడాకుల అంశం గురించి తొలిసారి స్పందించింది. తాను విడాకులు (Divorce) తీసుకున్నప్పుడు ఎంతో కుంగిపోయానంది. అంతేకాదు తాను చనిపోతానేమోనని అనుకున్నానని సామ్ బాధపడింది. తాను చాలా వీక్ పర్సన్ అని తన ఫీలింగ్‌ అని చెప్పుకొచ్చింది. అయితే తాను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. అది తెలిసి తనకే ఆశ్చర్యం కలుగుతోందని చెప్పుకొచ్చింది సామ్. తాను అంత స్ట్రాంగ్‌గా ఉంటానని అనుకోలేని పేర్కొం సమంత. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పింది సమంత. 


Also Read : Pushpa Trailer: పుష్ప ట్రైలర్‌ బాగా నిరాశపరిచింది.. అబ్బే ఊహించినంతగా లేదబ్బా!!


డైవర్స్ సమయంలో తనపై విపరీతంగా ట్రోల్స్ (Trolls) వచ్చాయని.. తనని ట్రోల్ చేయకుండా వారి అభిప్రాయాలను చెప్పి ఉంటే బాగుండని ఆమె పేర్కొన్నారు. తాను పిల్లలు వద్దకున్నా అని, తనకు అబార్షన్స్ (Abortions) అయ్యాయని ఇలా ఎన్నెన్నో ట్రోల్స్ తనపై జరిగాయని సామ్ బాధపడింది. 


ఇక ఈ ఏడాది తాను ఎంతో జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలన్నీ పటాపంచలు కావడంతో... వచ్చే ఏడాది తన జీవితంలో పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవని పేర్కొంది సామ్ (Samantha). భవిష్యత్తులో జరిగే ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది సామ్ (Sam). 


Also Read : Omicron Scare: ఢిల్లీ లోకనాయక్ ఆసుపత్రిలో చేరిన ఆ ముగ్గురు, ఇద్దరికి పాజిటివ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


Uttar PradeshSexual assaultRape on StudentsMolestation