Samantha Pregnancy: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హీరోయిన్‌ సమంతకు ఉన్న క్రేజ్‌ ఇంకెవరికీ ఉండదేమో. ఒకవైపు పర్సనల్ ఇష్యూతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సామ్‌.. మరో వైపు సినిమాల పరంగా విజయపథంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ చైతన్యతో డైవర్స్‌ తర్వాత సమంత వరుస మూవీలతో ఫుల్ బిజీ అయిపోయింది. అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి సామ్‌కు సినిమాల ఆఫర్స్‌ వస్తున్నాయి. భారీ మూవీల్లో కూడా సమంత నటిస్తోంది. మరోపక్క వెబ్‌ సీరిస్‌లలోనూ సమంత సత్తా చాటుతోంది. హాలీవుడ్‌లో కూడా సమంతకు ఆఫర్స్‌ వచ్చాయి. 


కాగా నాగ చైతన్యతో గతేడాది అక్టోబర్‌‌లో సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమంతకు సంబంధించిన ప్రతి విషయం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 


లవ్ మ్యారేజ్‌ చేసుకున్న సామ్, చైలు ఓ నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఈ జంటకు టాలీవుడ్‌ క్యూటెస్ట్‌ కపుల్‌ అని కూడా పేరు ఉండేది. అయితే ఈ జంట విడిపోయినా కూడా ఇప్పటికీ చాలా మంది మళ్లీ వారిద్దరూ కలవాలంటూ కోరుకుంటున్నారు. 


అంతేకాదు చై, సామ్‌ అన్యోన్య దాంపత్యంలో ఎన్నో స్వీట్‌ మెమోరీస్ ఉన్నాయి. వాటన్నింటినీ చై, సామ్‌ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్‌‌ చేస్తూ ఈ జంటపై ఉన్న అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. 


 కాగా సమంత తన ప్రెగెన్సీపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. 2019లో సామ్ సోషల్‌ మీడియా వేదికగా లైవ్‌ చాట్‌లో పాల్గొంది. ఆస్క్‌ మి ఎనీ థింగ్‌ అంటూ ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేసింది సామ్. ఆ చిట్‌ చాట్‌లో ఫ్యాన్స్‌ నుంచి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక ప్రశ్న సమంతకు ఎదురైంది. సమంత తన ప్రెగ్నెన్సీపై చాలా సానూకూలంగా స్పందించింది. 


తన బాడీలో వచ్చే చేంజెస్‌ కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.... అలాంటి వారందరికీ ఒక గుడ్‌ న్యూస్ అంటూ సామ్ పేర్కొంది. 2022 సంవత్సరం ఆగస్టు 7న ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు తాను ఒక బిడ్డకు జన్మనిస్తానంటూ సమంతా చెప్పుకొచ్చింది. 


అయితే సమంత గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాల్ వైరల్ అవుతున్నాయి. సామ్ చేసిన ఈ కామెంట్స్‌ను.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.


నాగ చైతన్య, (Naga Chaitanya) సమంత బంధం బాగుండి ఉంటే.. సమంత చెప్పినట్లుగానే ఈ సంవత్సరం వారికి నిజంగానే ఒక బిడ్డ జన్మించేవారు కదా అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తాన్ని సామ్, చైల ఫ్యాన్స్‌.. గతంలో ఉన్న సమంత (Samantaha) చైతన్యల అనోన్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు. 


Also Read: Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్


Also Read: POCO M4 Pro 5G: పొకొ నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook