Samantha - Naga Chaitanya: నాగ చైతన్య కోసం.. స్టార్ హీరో సినిమా వదులుకున్న సమంత!
Samantha Rejectes Shah Rukh Khan movie for Naga Chaitanya. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాను సామ్ వదులుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
Samantha Rejectes Shah Rukh Khan starrer Jawan movie for Naga Chaitanya: సమంత.. సినీ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు. ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత జోడి అందరిని ఆకట్టుకుంది. 'ఏమాయ చేశావే' భారీ హిట్ కొట్టడంతో.. తెలుగులో సమంతకు వరుస ఆఫర్లు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యరు.
ఏమాయ చేశావే సినిమాతో అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న చై-సామ్.. పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జోడి ఆరంభంలో బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో చై-సామ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారని విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. విడాకుల అనంతరం సామ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప సినిమా తర్వాత సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులల్తో పంచుకునే సామ్ పేరు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ క్రంమలోనే తాజాగా సమంత గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాను సామ్ వదులుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో 'జవాన్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నయనతార కంటే ముందు.. చిత్ర యూనిట్ సమంతను సంప్రదించిందట. 2019లోనే అట్లీ ఈ స్క్రిప్ట్‌ను సామ్‌కు వినిపించగా.. నాగ చైతన్యతో కలిసి కుటుంబ జీవనాన్ని ఆస్వాదించేందుకు ఆమె ఒప్పుకోలేదట.ఆ తర్వాత నాగ చైతన్య, సమంత విడిపోయిన విషయం తెలిసిందే.
Also Read: మా ఇంట్లో పైసల్ కాచే చెట్టు లేదు.. అందుకే ఐపీఎల్‌లో పనిచేస్తూ సంపాదిస్తున్నా: గౌతమ్ గంభీర్
Also Read: TS Weather Alerts: హైదరాబాద్‌లో భానుడి భగభగలు..ఉష్ణోగ్రతలు ఎంతంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook