Samantha Ruth Prabhu Instagram: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతపై నెట్టింట రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మయోసైటిస్‌ చికిత్సకు ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో రూ.25 కోట్లు సాయం చేశాడంటూ రూమర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతుండడంతో సమంత క్లారిటీ ఇచ్చారు. తన సమస్యను తాను పరిష్కరించుకోగలనని.. ఇతరుల నుంచి సాయం పొందాల్సిన తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. మయోసైటిస్‌ చికిత్సకు రూ.25 కోట్లా..? అని ఆశ్చర్యపోయారు. ఎవరో తప్పుడు సమాచారం అందించారని తెలిపారు. ఈ డబ్బులో చాలా తక్కువ తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు తాను సంతోషంగా ఉన్నానని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కెరీర్‌లో ఇప్పటివరకు నటించిన సినిమాలకు పారితోషికంగా రాళ్లు రప్పలు ఇచ్చారని తాను అనుకోవడం లేదన్నారు సమంత. తన బాగోగులు తాను చూసుకోగలనని.. థాంక్యూ.. అని ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. మయోసైటిస్‌ కారణంగా ఎన్నో వేల మంది బాధపడుతున్నారని చెప్పిన సమంత.. అలాంటి రోగానికి సంబంధించిన చికిత్సకు అయ్యే ఖర్చు గురించి ఇన్ఫర్మేషన్ అందించే ముందు దయచేసి కాస్త బాధ్యత వహించాలని కోరారు.


సమంత ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం విదేశాలకు విహారయాత్రకు వెళ్లిన ఈ స్టార్ హీరోయిన్.. అందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది శాకుంతలం మూవీతో ఆడియన్స్‌ను పలకించారు. ఈ యూవీ ప్రమోషన్స్ సందర్భంగానే తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేశారు. 


విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతోపాటు తమిళ్-ఇంగ్లిష్ ద్విభాషా చిత్రం అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్‌ మూవీ సిటాడెల్ షూటింగ్‌కు కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇండోనేషియా ట్రిప్‌లో ఉన్న సమంత.. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సబంధించిన పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తతం ఖుషి మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి  


Also Read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి