How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి

Chanakya Niti in Telugu: ఎదుటివారిని ఎలా కంట్రోల్ చేయాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పొందుపరిచారు. ఇతరుల స్వభావాన్ని బట్టి.. మనం మాట్లాడాల్సి ఉంటుంది. మనం చెప్పిన మాట వారు వినాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 12:54 PM IST
How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి

Chanakya Niti in Telugu: ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. ఎదుటివారు మన మాట వినేలా ఒప్పించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. తమ మాటతీరు ఆకట్టుకునే నేర్పు కొందరిలోనే ఉంటుంది. భారతీయ పురాతన తత్వవేత్త ఆచార్య చాణక్యుడికి ఎవరినైనా తన మాట`వినేలా చేసే శక్తి ఉంది. ఎదుటివారిని అలవోకగా తన నియంత్రణలోకి తెచ్చుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన బోధనలు, సూక్తులు నేటి యువతకు మార్గం దర్శకంగా నిలుస్తున్నాయి. ఆచార్య చాణక్యుడు ఎలాంటి వ్యక్తినైనా ఆకట్టునేలా ఎలా మాట్లాడలో తన నీతిశాస్త్రంలో వివరించారు. మీరు కూడా మీ మాటను ఇతరుల వినేలా.. మీ నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే చాణిక్యుని నీతిశాస్త్రంలోని విషయాలను తెలుసుకోండి. ఈ పద్ధతులను అనుసరించి.. ఎదుటివారిని ఆకట్టుకోండి.
 
ఎదుటివారితో మాట్లాడుతుంటే.. వారు ఎలాంటి వారో క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. వ్యక్తి స్వభావాన్ని బట్టి మనం మాట్లాడాలి. అందరికీ ఒకే రీతిలో ఆకట్టుకోలేం. ఇతరులకు మనం ఏ విషయం అయినా చెప్పే ముందు పూర్తి సమాచారం అందించాలి. మనం ఎన్ని చెప్పినా.. కొంతమంది తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోరు. అలాంటి వారి ధోరణిని మార్చాలంటే.. మనకు ముందు విషయ పరిజ్ఞానం ఉండాలి.  

అత్యాశ గల వ్యక్తులతో ఇలా..

ముల్లును ముల్లుతోనే తీయాలని అంటారు. అత్యాశ గల వ్యక్తికి ఏదైనా ఆశ చూపితినే లొంగుతారు. వారు మాటలకు అస్సలు పడిపోరు. అంటే డబ్బు లేదంటే వారు కోరుకున్నది ఇచ్చినప్పుడే మీ చెప్పిన విషయాలను అంగీకరిస్తారు.

తెలివి తక్కువ వారితో..

తెలివి తక్కువ వ్యక్తులను ఒప్పించాలంటే.. వారి మనస్తత్వానికి తగిన విధంగా వ్యవహరించాలి. వారికి నచ్చిన పనిని మీరు చేస్తే.. వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడే మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మీరు చెప్పినదల్లా చేస్తారు.  

తెలివైన వ్యక్తులతో ఇలా..

తెలివైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారితో మీరు తెలివిగానే మాట్లాడాలి. తెలివితో మీరు చెప్పే విషయాలను వారు అంగీకరిస్తారు. అతి తెలివి ప్రదర్శించకుండా.. వాళ్లకు నిజాలే చెప్పాలి. మీకు కూడా అన్ని విషయాల గురించి తెలియకపోతే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు. మిమ్మల్ని చులకనగా కూడా చూస్తారు. 

గర్విష్ఠులతో ఇలా..

అహంకారం ఉన్న వ్యక్తులను ఒప్పించడానికి ముందు మీ గర్వం పక్కనపెట్టాల్సి ఉంటుంది. వారిని మీ నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే.. వాళ్లను గౌరవించాలి. వారికి నమస్కరించి.. కాస్త పొగడాలి. వారిని పొగడ్తలతో ముంచేస్తూ.. తల వంచినట్లు ప్రవర్తించాలి. ఇలా చేస్తే వాళ్లే వాళ్లకు తెలియకుండా మీ మాటలకు బానిసలుగా మారిపోతారని చాణక్య నీతి  చెబుతోంది. అహంకారులు సాధారణంగా ఎవరి మాట వినరు. తమ ఎంచుకురన్న మార్గమే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. అందుకే వారికి ఇచ్చే విలువను వారి ఇచ్చి.. మీ వ్యవహరాలను చక్కదిద్దుకోవచ్చు. 

Trending News