Samantha Shakuntalam సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. మళ్లీ సోషల్ మీడియాలో మునుపటిలా యాక్టివ్ అయింది. సమంత వరుసగా పోస్టులు చేస్తోంది. ముంబై ఎయిర్ పోర్టులో సమంత కాస్త సీరియస్‌గానే కనిపించింది. ఫోటో అడిగిన ఫ్యాన్‌తో కూల్‌గా ఫోటో దిగింది. అయితే సమంత శరీరంలో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి. చాలా సన్నగా అయింది. మొహంలోనూ కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత ఇప్పుడు శాకుంతలం సినిమా కోసం డబ్బింగ్ చెబుతోంది. శాకుంతలం సినిమాను పూర్తి చేసే పనిలో సమంత పడింది. శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత తన శక్తినంతా కూడబెట్టుకుని లేచినట్టుంది. బెడ్డు మీద నుంచే డబ్బింగ్ చెప్పింది. ఆ తెల్లారే ముంబైకి బయల్దేరింది. ఎయిర్‌ పోర్టులో అలా మొదటి సారిగా దర్శనం ఇచ్చింది.


 



సమంత ఇప్పుడు తన పెట్‌తో క్యూట్‌గా ముచ్చట్లు పెట్టేసింది. శాకుంతలం కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. శాకుంతలం సినిమాలో మాట్లాడినా, నడిచినా, పరిగెత్తినా చివరకు ఏడ్చినా సరే ఓ గ్రేసును మెయింటైన్ చేయాల్సి ఉండేది. అదే నాకు చాలా కష్టంగా అనిపించేది.. ఎందుకంటే గ్రేస్ అనేది నాకు తెలియనే తెలియదు.. నేను ఆ గ్రేస్ తెచ్చుకోవడానికి ఇలా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది.. అప్పుడు ఈ సాషాను కూడా తీసుకెళ్లాల్సింది..


దానికి కూడా గ్రేస్ అంటే ఏంటో తెలియదు.. లైక్ మదర్ లైక్ డాటర్ అంటూ సమంత చెప్పుకొచ్చింది. నీకు తెలియదానే? నువ్వేం చెబుతున్నావే.. అన్నట్టుగా చిన్మయి ఈ పోస్టుకు స్పందించింది. నువ్వూ నీ భర్త చాలే నా ప్రాణానికి అన్నట్టుగా సమంత కౌంటర్ వేసింది. సమంత, చిన్మయి పోస్ట్‌లను చూసి రాహుల్ తెగ నవ్వేశాడు.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి