Samantha Hands Injured సమంత ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌ల కోసం, పాత్రల కోసం తగినట్టుగా మారుతోంది. అందుకే హెవీ వర్కౌట్లు చేస్తోంది. ఆమె ఇప్పుడు నైనిటాల్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే సిటాడెల్ వెబ్ సిరీస్, శివ నిర్వాణ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టుల కోసమే హెవీ వర్కౌట్లు చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రిహార్సల్స్ చేస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత చేతికి గాయాలయ్యాయి. చేయి, వేళ్లు అంతా కూడా కమిలిపోయి రక్తం కారుతూ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత ప్రస్తుతం ఎంతగా కష్టపడుతోందో.. ఎంత కసిగా ఉందో చెప్పడానికి ఈ ఫోటో ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఇంతలా రిహార్సల్స్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తోందంటే.. తెరపై ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ట్రైనర్ జునైద్ ఆధ్వర్యంలో ఈ రిహార్సల్స్ చేస్తున్నట్టుగా ఉంది. సమంత తన చేతి పరిస్థితిని చెబుతూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టేసింది.


ఇక ఆ పోస్టుకు ట్రైనర్ జునైద్ రిప్లై ఇచ్చాడు. వీటిని కొందరు గాయాలని అంటారు కానీ అవి మనకు ఆభరణాలు అని కామెంట్ పెట్టాడు. దీంతో జునైద్ మాటలకు సమంత దండం పెట్టేసింది. యోధుడు అనే వాడికి గాయాలే ఆభరణాలు అనే నానుడి ఉందన్న సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పుడు సమంతకు అన్వయించాడు జునైద్.


[[{"fid":"263988","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సమంత ఇప్పుడు తన ఫుల్ ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టేసింది. తన ఫ్రెండ్స్‌తో కూడా ఎక్కువగా కలవడం లేదు. ఒకప్పుడు అయితే ప్రీతమ్, సాధనలతోనే సమంత కనిపించేది. ఇప్పుడు మాత్రం సమంత ఒంటరిగా తన పనుల్లో తాను బిజీగా ఉంటోంది. ఒప్పుకున్న సినిమాలను ముందుగా పూర్తి చేయాలని సమంత ఫిక్స్ అయినట్టుంది.


[[{"fid":"263990","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


నటిగా సమంతకు పదమూడేళ్లు అవ్వడం, ఏ మాయ చేశావే సినిమా రిలీజ్ అయి 13 ఏళ్లు అవ్వడంతో సమంత వేసిన పోస్ట్, నాగ చైతన్య వేసిన పోస్టుల మధ్య తేడాలు చూపిస్తూ అక్కినేని అభిమానులు సమంతను ట్రోల్ చేశారు. చైతూ ఉన్న పోస్టర్‌ను సమంత షేర్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook