IFFI Awards 2021: గోవా వేదికగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఇఫీ) ను నవంబరు 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు స్టార్ హీరోయిన్ సమంత ఆహ్వానం అందింది. ఈమెతో పాటు వ్యాఖ్యాతలుగా అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, డైరెక్టర్ అగ్నిహోత్రిని నియమించినట్లు ఇఫీ నిర్వాహకులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ఇప్పుడు ఇఫీ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ వేడుకలో స్పీకర్ గా ఆహ్వానం పొందిన తొలి దక్షిణాది నటిగా సమంత ఘనత సాధించారు.


భారీ రెమ్యూనరేషన్..!


టాలీవుడ్ నటి సమంత(samantha new movies) ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నాగచైతన్యతో విడాకులు అయినప్పటి నుంచి వరుసగా పర్యటనలు, యాత్రలకు వెళుతోంది. ఇప్పటికే ఆమె నటించిన 'శాకుంతలం' షూటింగ్ పూర్తిచేసుకోగా.. మరికొన్ని ప్రాజెక్టులు లైనప్​లో ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలకూ ఓకే చెబుతోంది. తాజాగా సినీ వర్గాల చెబుతున్న దాని ప్రకారం సామ్.. ఒక్కసారిగా భారీగా పారితోషికం(samantha remuneration per movie) పెంచిందట. ఓ సినిమాకు ఏకంగా రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.


'శాకుంతలం'తో పాటు సమంత(samantha new movies) నటించిన 'కాతువాకుల రెండు కాదల్‌' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు, 'డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌', శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఒప్పుకొంది సామ్. మరికొన్ని పాన్ ఇండియా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. 


Also Read: Akhanda Title Song: ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. అఘెరా లుక్ లో బాలయ్య 


Also Read:  Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook