Samantha Reply to Nagachaitanya: మనని అవే దూరం చేశాయి.. నాగచైతన్యకి సమంత కౌంటర్?
Samantha Ruthprabhu Indirect Reply to Nagachaitanya: కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సమంత గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, అయితే దానికి సమంత పరోక్షంగా కౌంటర్ వేసింది.
Samantha Ruthprabhu Indirect Reply to Nagachaitanya Comments on her: ఏం మాయ చేసావే సినిమా షూటింగ్లో ఒకరికొకరు కలుసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు అప్పుడు ప్రేమలో పడలేదు. కానీ మంచి స్నేహితులయ్యారు. వారి స్నేహం ముదిరి పాకానపడి ఎట్టకేలకు ప్రేమగా మారింది. అయితే ప్రేమించుకున్నాక పెద్దలను ఒప్పించి ఈ జంట హిందూ, క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం వివాహం కూడా చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. వివాహం జరిగిన నాలుగేళ్లకి వీరిద్దరూ తాము విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
అలా ప్రకటించిన ఏడాదికి వీరి విడాకుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక వీరు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతున్నారు. కానీ వీరి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది వారిద్దరికీ తెలుసు. కానీ ఇందుకే విడాకులు తీసుకున్నారంటూ మీడియాలో సోషల్ మీడియాలో అనేకమంది తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు చాలా మంది.[[{"fid":"272158","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ విషయం మీద సమంత బాధపడి ఒకసారి కోర్టు మెట్లు కూడా ఎక్కిన సంగతి తెలిసిందే, కోర్టు కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ మీద వెబ్సైట్స్ మీద మండిపడి మరోపక్క సమంతకు కూడా జాగ్రత్తలు చెప్పింది. ఇక వీరు విడాకులు తీసుకుని ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ సమంత మాత్రం ఎప్పటికప్పుడు తన ఆవేదన సోషల్ మీడియా వేదికగా పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
Also Read: Naga chaitanya: సమంత చాలా మంచిది.. 'ఆమె'ను అగౌరవపరుస్తున్నారు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు
నాగచైతన్య అనేక సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తాజాగా ఈ కస్టడీ అనే సినిమా రూపొందింది. కృతి శెట్టి హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
పెద్ద ఎత్తున ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సమంత గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత చాలా మంచి మనిషి అని పేర్కొన్న నాగచైతన్య ఆమె తన జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాక తామ ఇద్దరి మధ్య మంచి గౌరవ సంబంధాలు ఉన్నాయని కానీ మీడియాలో మా ఇద్దరి మధ్య పగ ఉన్నట్లుగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాక అసలు తనకు సంబంధం లేని మరో వ్యక్తిని కూడా తీసుకువచ్చి ఇందులో ఆమెను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆయన ఈ కామెంట్స్ చేసిన రోజే సమంత తన సోషల్ మీడియా వేదికగా దీనికి రిప్లై ఇచ్చిందా అన్నట్లుగా ఒక పోస్ట్ షేర్ చేసింది. సమంత ” మనమంతా ఒక్కటే. ఇగో, భయాలు మనల్ని మనవారి నుంచి దూరం చేస్తాయి’’ అనే కొటేషన్ ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
చైతన్య కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తరువాత సమంత ఈ పోస్ట్ పెట్టడంతో ఈ కారణాలతోనే వీరిద్దరూ విడిపోయి ఉంటారన్న ఊహాగానాలు ఇప్పుడు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. నాగ చైతన్య ఇంటర్యూలో సోషల్ మీడియా వల్ల చాలా డిస్టర్బ్ అయ్యామని, నెట్టింట్లో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య దరం పెరిగిందని అర్థం వచ్చేలా కామెంట్లు చేయడంతో సమంత కూడా తన పోస్ట్ ద్వారా అదే పాయింట్ మరోసారి బల్లగుద్ది చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook