Naga chaitanya: సమంత చాలా మంచిది.. 'ఆమె'ను అగౌరవపరుస్తున్నారు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

Naga Chaitanya Responds on Sobhita Dhulipalla Rumors:  తన మాజీ భార్య సమంత చాలా మంచి వ్యక్తని కామెంట్ చేసిన నాగచైతన్య కొందరు కావాలని తన గతంతో సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 08:08 PM IST
Naga chaitanya: సమంత చాలా మంచిది.. 'ఆమె'ను అగౌరవపరుస్తున్నారు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

Naga Chaitanya Open Comments on Samantha Ruthprabhu: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి ఈ అక్టోబర్ వస్తే దాదాపు రెండేళ్లు పూర్తవుతాయి. అయితే విడాకుల అనంతరం సమంత తన బాధను వ్యక్తం చేసుకోవడానికి ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తూ ఉంటే నాగచైతన్య మాత్రం ఎప్పుడూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న దాఖలాలు అయితే లేవు. సమంత ఎప్పటికప్పుడు తన ఆవేదనని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

నాగచైతన్య సమంత సినిమాల్లో బిజీ అయ్యి ఎవరు సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే సమంత కానీ నాగచైతన్య కానీ ఎప్పుడూ తమ మాజీ భార్య, తమ భర్త గురించి నేరుగా మీడియా ముఖంగా స్పందించిన దాఖలాలు లేవు. సమంత సందర్భం వచ్చిన ప్రతిసారీ ఇండైరెక్టుగా తన విడాకుల గురించి తన బాధ గురించి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ తాజాగా నాగచైతన్య విడాకుల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సమంత గురించి విడాకులు తీసుకున్న తర్వాత మీడియా ముఖంగా మొట్ట మొదటి సారి మాట్లాడిన నాగచైతన్య తామిద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చాడు.  

Also Read: Ott Releases This week: ఈ వారం ఓటీటీలోకి 11 సినిమాలు.. ఏమేం రిలీజ్ అయ్యాయంటే?

ఆమె చాలా మంచిదని అందుకే ఆమె జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. మే 12వ తేదీన నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన కస్టడీ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగచైతన్య ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ మేము విడిపోయి దాదాపుగా రెండు ఏళ్ళు అవుతోంది, చట్టప్రకారం డైవర్స్ తీసుకుని సంవత్సరం అవుతుంది.

మేము మా లైఫ్ లో ముందుకెళుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా సమంత చాలా మంచి మనిషిని ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అభిలాషను వ్యక్తం చేశారు. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా మంచి గౌరవం ఉంది కానీ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు వల్ల మాకు ఒకరి మీద ఒకరికి అసలు ఏమాత్రం గౌరవం లేదేమో అనే మెసేజ్ ప్రజల్లోకి వెళుతోందని అది తనను బాగా బాధ పెడుతోందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

మరీ ముఖ్యంగా నాకు గతంలో ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని ఈ ఇష్యూలోకి లాగుతున్నారని, దీనివల్ల ఆ వ్యక్తిని కూడా అగౌరవపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అసలు మా పెళ్లి, విడాకుల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాంట్రవర్సీలు ఎందుకు సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడంలేదని ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఆయన తన గతంతో సంబంధం లేని వ్యక్తి అని సంబోధించింది శోభిత ధూళిపాల గురించే అని కొందరి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.

Also Read: Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News