Samantha Ruthprabhu Instagram Account Hacked: కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పెళ్లిళ్ల గురించి కామెంట్ చేసిన సమంత అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిన సంగతి వెల్లడైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సమంత రూత్ ప్రభు వాడుతున్న అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందట. సోమవారం రాత్రి ఆమె సినిమాలకు సంబంధించి అలాగే పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారని టాక్. అయితే అవి సమంత గాని సమంత టీం గాని షేర్ చేయలేదని విషయం తర్వాత వెల్లడైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కొన్ని షేర్ చేయకూడని చిత్రాలు షేర్ చేశారనే విషయాన్ని గమనించిన ఫ్యాన్స్ ఆమె దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. కొందరు వాటిని స్క్రీన్ షాట్లు కూడా తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సమంత ఫోన్ నుంచి కేటీఆర్ ఫోటో షేర్ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం సమంత టీం దృష్టికి వెళ్లిన వెంటనే వారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని తమ అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. సమంత ఎకౌంటు మేనేజ్ చేస్తున్న శశాంక బినేష్ అనే సోషల్ మీడియా మేనేజర్ ఒక చిన్న టెక్నికల్ గ్లిచి కారణంగా సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని విషయాన్ని వెల్లడించింది. 




ఇన్స్టాగ్రామ్ టీంతో మాట్లాడి ఈ విషయాన్ని క్లోజ్ చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం మీద ఏర్పడిన కన్ఫ్యూజన్ కారణంగా తాము క్షమాపణలు కోరుతున్నామని ఆమె వెల్లడించారు. ఇక సమంత తమిళ,  తెలుగు భాషలలో వరస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క ఆమె ఒక ఇంటర్నేషనల్ ఫిలింలో కూడా యాక్ట్ చేస్తోంది.  బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు చాలా ఆఫర్లువస్తున్నాయని తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి ఆమె ఎలాంటి ఆఫర్ ఒప్పుకున్నట్టు దాఖలాలు లేవు. కాకపోతే తాప్సీ నిర్మిస్తున్న ఒక సినిమాలో సమంత నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆ విషయాన్ని తాప్సి ధృవీకరించింది.


Also Read: Chiranjeevi Name: ఆచార్య ఎఫెక్ట్ తో పేరు మార్చుకున్న చిరంజీవి.. అదృష్టం కోసమేనా.. అసలు నిజమేంటి?


Also Read: Anshula Kapoor: లైవ్ వీడియోలో లోదుస్తులు తీసిపారేసిన స్టార్ హీరో చెల్లి.. దారుణంగా ఆడుకుంటున్నారుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.