Chiranjeevi Name: ఆచార్య ఎఫెక్ట్ తో పేరు మార్చుకున్న చిరంజీవి.. అదృష్టం కోసమేనా.. అసలు నిజమేంటి?

Chiranjeevi Name changed: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేసిన ఆచార్య సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన పేరు మార్చుకున్నారని, తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Last Updated : Jul 5, 2022, 04:51 PM IST
  • చిరంజీవి పేరు మార్చుకున్నారంటూ ప్రచారం
  • గాడ్ ఫాదర్ వీడియోతో కొత్త అనుమానాలు
  • అసలు విషయం అది కాదంటూ సన్నిహితుల క్లారిటీ
Chiranjeevi Name: ఆచార్య ఎఫెక్ట్ తో పేరు మార్చుకున్న చిరంజీవి.. అదృష్టం కోసమేనా.. అసలు నిజమేంటి?

Chiranjeevi Name changed: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పునాదిరాళ్లు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత మెగాస్టార్ గా ఎదిగి తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు.  అయితే రాజకీయాల్లోకి వెళ్లి సినీ రంగానికి దూరమైన ఆయన రాజకీయాల్లో కాలం కలిసి రాకపోవడంతో తిరిగి సినీ ఎంట్రీ ఇచ్చి సైరా నరసింహారెడ్డి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అయితే తన కుమారుడితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేసిన ఆచార్య సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన పేరు మార్చుకున్నారని, తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 

కానీ అది నిజం కాదని చిరంజీవి సన్నిహితుల ద్వారా వెల్లడయింది. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఒక చిన్న వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ ఒక కారులో వస్తుండగా అదే కారులో వచ్చిన సునీల్ ఆయన దిగుతుండగా కార్ డోర్ తీయడంతో మెగాస్టార్ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి పేరు పడేలా చేసింది సినిమా యూనిట్. అయితే ఈ సమయంలో చిరంజీవి పేరులో ఉన్న అక్షరాల కంటే ఒక అక్షరం ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో ఆయన పేరు మార్చుకున్నారని ప్రచారం మొదలయింది. 

ఆచార్య ఎఫెక్ట్ బాగా పడడంతో ఈసారి ముందు జాగ్రత్త చర్యతో న్యూమరాలజిస్టు సలహా తీసుకుని పేరుకు తగిన మార్పులు చేశారంటూ ప్రచారం మొదలైంది. చాలామంది సెలబ్రిటీలు ఇలా పేర్లు మార్చుకోవడం కామన్ కావడంతో చిరంజీవి కూడా పేరు మార్చుకున్నారని అందరూ భావించారు. కానీ అది నిజం కాదు అని చిరంజీవి సన్నిహితులు వెల్లడించారు. మెగాస్టార్ పేరు మార్పు వార్తలు నిజం కాదని కేవలం గాడ్ ఫాదర్ సినిమా యూనిట్ వీడియో తయారు చేసిన సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఆ అక్షరం అదనంగా వచ్చింది తప్ప మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకోలేదని సమాచారం. 

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగులో మోహన్ రాజా దర్శకుడిగా గాడ్ ఫాదర్ పేరిట  రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే తెలుగు హీరో సత్యదేవ్ నయనతార జంటగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారని తాజాగా విడుదలైన వీడియో ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సమర్పిస్తున్నారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని సినిమా యూనిట్ వెల్లడించింది.
Also Read: Anshula Kapoor: లైవ్ వీడియోలో లోదుస్తులు తీసిపారేసిన స్టార్ హీరో చెల్లి.. దారుణంగా ఆడుకుంటున్నారుగా!

Also Read: Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x