Shaakuntalam May Postpone again: టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో శాకుంతలం సినిమా కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తగినట్లుగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఒక కీలకపాత్రలో నటించడంతో పాటు ఆమె పాత్ర సుమారు ఆరు నిమిషాలకు పైగా ఉంటుందని సినిమా మేకర్స్ ప్రకటించడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకు అంతకు పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమాలో సమంత శకుంతల అనే పాత్రలో కనిపిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ అనే మలయాళ నటుడు కనిపిస్తున్నాడు. ఇక అల్లు అర్హ భరతుడి పాత్రలో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ సినిమాని త్రీడీలో రిలీజ్ చేయడానికి టీం సిద్దమైన నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఫిబ్రవరి 17వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.


వాస్తవానికి గత ఏడాది నవంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్న త్రీడీ వర్షన్ కోసమే అని చెబుతూ రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన తెలుగుతో పాటు మలయాళ భాషలతో పాటు మరికొన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటనలు వచ్చాయి. ఒకే సారి 2డీ, 3డీ వర్షన్ లో సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాని హోల్ సేల్ గా కొనేసిన దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.


కానీ ఈసారి చెప్పిన డేట్ కంటే మరోసారి వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎందుకు వాయిదా పడింది? అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ సినిమా వాయిదా పడిందనే ప్రచారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి అదే రోజున ధనుష్ నటించిన వాతి-సార్ సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ, విశ్వక్ సేన్ ధమ్కీ అనే సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా వేసారేమో అనే వాదన వినిపిస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. 


Also Read: Taraka Ratna CT Scan Reports:తారక రత్న సీటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు..బ్రెయిన్ కు ఎఫెక్ట్?


Also Read: Balakrishna Mantra: 'తారకరత్న' గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసిన మహామృత్యుంజయ మంత్రం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook