Samantha Shocked: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను ఎంతలా ఉర్రూతలూగించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, మాటలు, హీరో మేనరిజమ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. నిన్న, మొన్నటివరకూ పుష్ప సాంగ్స్, డ్యాన్స్, డైలాగ్స్ ఇమిటేషనే వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిచ్చాయి. ఇక ఈ సినిమాలోని సమంత ఐటెం నంబర్ 'ఉ అంటావా మావా...' ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ఈ పాటలో సమంత హాట్‌నెస్, చంద్రబోస్ లిరిక్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ ప్రేక్షకులను నిజంగానే ఉర్రూతలుగించాయి. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఈ పాట మారుమోగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా అమెరికాలోని మియామిలో జరిగిన 'అల్ట్రా మియామి మ్యూజిక్ ఫెస్టివల్'లో 'ఉ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా..' సాంగ్‌ను ప్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో అది సమంత దృష్టిలో పడింది. దీంతో ఇది నిజమేనా...? అంటూ సమంత తన ట్వీట్ ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సమంత ట్వీట్‌పై ప్రముఖ డీజే, మ్యూజిక్ ప్రొడ్యూసర్ కేఎస్‌హెచ్ఎంఆర్ స్పందిస్తూ... 'అది నిజమేనని కన్ఫమ్ చేస్తున్నాను. ఆ పాట ప్లే చేస్తోంది నేనే..' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో సమంత సందేహం తీరినట్లయింది.


సమంత 'ఉ అంటావా మావా..' సాంగ్‌కి ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 213 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే పాటకు సమంత డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోకి దాదాపు 39 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తొలిసారి సమంత ఐటెం సాంగ్‌లో నటించడం.. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించడంతో ఈ సాంగ్ బాగా పేలింది. పుష్ప క్రేజ్‌ను చూసి... అల్లు అర్జున్ ఇక ప్యాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 




Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!


Also Read: Vijay-Puri: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో మరో మూవీ.. రేపే లాంచింగ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook