Allu Arjun-Atlee


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా కాలం పాటు ప్రేమించి హీరో నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న స్టార్ బ్యూటీ సమంత 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల తర్వాత సమంత కరియర్ లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్టు కూడా రాలేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో తన అందాలతో బాగానే అలరించింది సమంత.


ఆ తర్వాత ఆమె నటించిన యశోద సినిమా మంచి రివ్యూస్ ను అందుకుంది కానీ భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకోలేకపోయింది. ఇక శాకుంతలం సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే విడుదలైన ఖుషి సినిమాతో మళ్ళీ పర్వాలేదు అనిపించింది సామ్.


ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఒక భారీ ప్రాజెక్టు బాగా అవసరం. తాజా సమాచారం ప్రకారం ఆమెకు ఒక ప్యాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ సమంత కి ఈ ఆఫర్ ఇచ్చిన హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.


ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి మొదలు పెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తోంది.


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సమంతను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తేరి అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ తో కూడా సమంత సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే.


ఇప్పుడు నిజంగానే సమంతకు మళ్ళీ ఈ ఆఫర్ వస్తే అది ఆమె కెరియర్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఈ భారీ ప్రాజెక్టుతో అయినా సమంత కెరియర్ బాగుపడుతుందో లేదో చూడాలి.


Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook