Samantha to play female lead in Jr Ntr's next: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమంత ఇప్పటివరకు బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కలిసి నటించారు. అందులో రెండు సినిమాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని మెప్పించగా మరో రెండు చిత్రాలు కొంత నిరాశపర్చాయి. ఆ రెండు సినిమాలు కూడా కమెర్షియల్‌గా నిరాశపర్చినప్పటికీ.. ఎంటర్‌టైన్మెంట్ పరంగా ఎన్టీఆర్, సమంత అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నచ్చిన సినిమాలే. ఇదిలావుండగా తాజాగా వీళ్లిద్దరి కాంబోలో ఐదో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరవింద సమేత మూవీ ( Aravinda Sametha movie ) తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సమంతనే హీరోయిన్‌గా ( Samantha Akkineni ) తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. ఈ మేరకు సమంతతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది. Also read : Radhe Shyam Music director: రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతడేనా ?


అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేయనున్నాడట. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలన్నీఅమెరికాలోనే షూట్ చేయనున్నట్టు టాక్. 


ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో ( RRR movie shooting ) బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ల కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అరవింద సమేత లాంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ( Trivikram direction ) యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. Also read : Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe