Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు

Tollywood Donations To Telangana CM Relief Fund | ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి చిగురుటాకులా మారింది. నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఇళ్లు నీట మునిగాయి. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు.

Last Updated : Oct 20, 2020, 04:03 PM IST
Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు

హైదరాబాద్: వారం రోజుల నుంచి తెలంగాణను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి చిగురుటాకులా మారింది. నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఇళ్లు నీట మునిగాయి. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖుల విరాళాలు ప్రకటిస్తున్నారు. 

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. తోచినంత విరాళం ప్రకటించి వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నాగార్జున రూ.50 లక్షలు, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు తమ వంతుగా సాయం ప్రకటించారు.

 

హారికా హాసిని క్రియేషన్స్ రూ.10 లక్షలు, టాలీవుడ్ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు, అనిల్ రావిపూడి రూ.5 లక్షలు, హరీష్ శంకర్ రూ.5 లక్షలు చొప్పున సీఎం సహాయనిధికి అందజేయనున్నట్లు తెలిపారు. విపత్కర సమయంలో తమ వంతు సహాయసహకారాలను అందించాలని టాలీవుడ్ సెలబ్రిటీలు పిలుపునిచ్చారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News