Citadel Honey Bunny: సిటాడెల్.. హనీ బన్నితో సమంత ఈజ్ బ్యాక్.. అదిరిపోయిన ట్రైలర్..
Citadel Honey Bunny : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది సమంత. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా వాళ్ల డైరెక్షన్ లోనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేసింది. హన్ని బన్ని పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
Citadel Honey Bunny Trailer Talk: సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ లో యాక్ట చేసిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’. ఈ వెబ్ సిరీస్ లో 90ల నేపథ్యంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్. పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ గా వెబ్ సిరీస్ గా రాబోతుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచేశారు. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత మరోసారి యాక్షన్ సీన్స్ లో ఇరగదీసింది. ఉత్కంఠ భరితమైన ఈ సిరీస్ లో గూఢ చర్యం కారణంగా దేశ ద్రోహుల చేతుల్లో ఇరుక్కుపోతారు. కొన్నేళ్ల తర్వాత బయటకు వచ్చిన తర్వాత దూరమైన హనీ, బన్ని కలిసి వారి కూతురేు నదియాను ఎలా రక్షించేందుకు ఎలా పోరాడరనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ.
ది ఫ్యామిలీ మ్యాన్2 తర్వాత సమంత కెరీర్ లో ఈ వెబ్ సిరీస్ మరో మైలు రాయిలా నిలిచిపోయే అవకాశాలున్నాయి. సమంత తొలిసారి తన కెరీర్ లో స్పై పాత్రలో యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కోసం తనను తాను ఎంతో మౌల్డ్ చేసుకుంది. ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. హనీ పాత్రలో సమంత యాక్ట్ చేస్తే.. బన్ని పాత్రలో వరుణ్ ధావన్ యాక్ట్ చేశారు. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న వరల్డ్ వైడ్ గా 240 పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కు రానుంది.
సమంత విషయానికొస్తే.. గతేడాది ‘శాకుంతలం’, ఖుషీ సినిమాలతో పలకరించింది. గతంలో సామ్.. ‘సామ్ జామ్’ అంటూ టాక్ షో నిర్వహించింది. త్వరలో ‘రక్త్ బ్రహ్మాండ్’ .. ది బ్లడీ కింగ్ డమ్’ వెబ్ సిరీస్ తో పలకరించింది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
మరోవైపు కొండా సురేఖ ఇష్యూతో సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. కేటీఆర్ వ్యవహారంతోనే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నట్టు చెప్పిన మాటలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter