Samantha wishes to Akhil: మాజీ భర్తను పట్టించుకోదు కానీ మరిదికి మాత్రం స్పెషల్ విషెస్.. అఖిల్‌పై సమంత పోస్ట్ వైరల్
Samantha Wishes to Akhil: అఖిల్ అక్కినేని బర్త్ డే సందర్భంగా అక్కినేని అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక అఖిల్‌కు సమంత స్పెషల్‌గా విషెస్ చెప్పింది.
Samantha Birthday Wishes to Akhil: సమంత అక్కినేని, దగ్గుబాటి వారితో ఇంకా రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంది. అయితే నాగ చైతన్య, నాగార్జున వంటి వారి విషయంలో మాత్రం సమంత నోరు మెదపడం లేదు. నాగార్జునకు ఆ మధ్య విషెస్ చెబుతూ వేసిన ట్వీట్లలో మామయ్యా, మామ అని కనిపించలేదు. ఆ టైంలోనే సమంత చైతూ విడాకుల రూమర్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అలా సమంత నాగార్జున పట్ల వ్యవహరించిన తీరుతో.. విడాకుల రూమర్లు కన్ఫామ్ అయ్యాయి.
విడాకుల తరువాత సమంత.. నాగ చైతన్యకు ఇంత వరకు విషెస్ చెప్పలేదు. నాగ చైతన్య సినిమాలు వస్తే కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు. నాగార్జున బర్త్ డేకు సైతం సమంత స్పందించడం లేదు. కానీ అఖిల్ బర్త్ డే వస్తే మాత్రం సమంత స్పెషల్‌గా పోస్ట్ వేస్తూ ఉంటుంది. అఖిల్ ఏజెంట్ సినిమా మీద ఎప్పటికప్పుడు తన విషెస్ చెబుతూనే ఉంటుంది.
సమంత ఇలా అఖిల్‌కు విషెస్ చెబుతుంటుంది. కానీ అఖిల్ మాత్రం తిరిగి సోషల్ మీడియాలో స్పందించినట్టుగా ఎక్కడా కనిపించదు. పర్సనల్‌గా థాంక్యూ చెబుతాడో ఏమో గానీ.. సమంత మాత్రం ఎప్పుడూ అఖిల్ పట్ల కాస్త ప్రేమగానే ఉంటుంది. ఇప్పుడు అఖిల్‌కు విషెస్ చెబుతూ.. ఏజెంట్ కొత్త పోస్టర్, సినిమా రిలీజ్ డేట్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది.
[[{"fid":"268683","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
హ్యాపీ బర్త్ డే అఖిల్ అంటూ హగ్స్, లవ్ సింబల్స్‌ను షేర్ చేసింది. ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా వస్తోంది.. ఇది కచ్చితంగా అదిరిపోతుంది.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ అఖిల్ ఏజెంట్ మీద ప్రేమను కురిపించింది సమంత. మరి దీనిపై అఖిల్ స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
సమంత నాగ చైతన్య వార్తలు ఈ మధ్య ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాను వైవాహిక బంధంలో వంద శాతం ఇచ్చానని, కానీ వర్కౌట్ అవ్వలేదని, తన డైవర్స్ గురించి చెప్పింది. ఇక నాగ చైతన్య శోభిత దూళిపాళ డేటింగ్ రూమర్ల మీద తాను స్పందించినట్టుగా వచ్చిన వార్తలను ఖండించింది సమంత. తాను ఎప్పుడూ వారి గురించి మాట్లాడలేదు అని చెప్పుకొచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook