సమంత తొలిసారిగా సామ్ జామ్ అనే ఓ టాక్ షోకు సైన్ చేసింది అని తెలియగానే.. సినిమాల్లో బిజీగా ఉన్న సమంత ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై ఓ టాక్ షో చేయడం ఏంటి అని అనుకున్నారు ఆమె అభిమానులు. సినిమాలతో బిజీగా ఉంటూనే టాక్ షో కోసం సైన్ చేసిందంటే.. సమంతకు భారీ మొత్తంలో పారితోషికం అంది ఉండి ఉంటుందనే టాక్ కూడా వినిపించింది. అయితే, ఆ పారితోషికం ఎంతనేది మాత్రం ఆమెకు, ఆమెతో సైన్ చేయించుకున్న వారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పాటు ఫిలింనగర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సమంతకు సామ్ జామ్ షో కోసం రూ. 1.5 కోట్లు రెన్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సామ్ జామ్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా.. అందులో ఒక్కో ఎపిసోడ్ కి రూ. 15 లక్షల చొప్పున మొత్తం 10 ఎపిసోడ్లకు కలిపి ఆమెకు రూ. 1.5 కోట్లు అందినట్టు టాలీవుడ్ టాక్. అయితే, ఇలాంటి వ్యవహారాలపై ఎప్పుడూ అధికారిక ప్రకటనలు చేయరు కనుక ఇందులో నిజం ఎంత ఉందనేది చెప్పడం మాత్రం కష్టమే.


Also read : Samantha Akkineni: 10 అంతర్జాతీయ భాషల్లో సమంత క్రేజీ ప్రాజెక్ట్


ఇదిలావుంటే, ఇప్పటివరకు సామ్ జామ్ షోలో ఆరు ఎపిసోడ్స్ పూర్తి కాగా 7వ ఎపిసోడ్‌లో సమంత ( Samantha Akkineni ) తన భర్త నాగచైతన్యనే ఇంటర్వ్యూ చేయనుంది. చైతూ ఎపిసోడ్‌తోనే ఈ సామ్ జామ్ టాక్ షో పూర్తి కానున్నట్టు మరో టాక్ వినిపిస్తోంది. అదే కానీ జరిగితే మరో 3 ఎపిసోడ్స్ మిగిలి ఉండగానే సామ్ జామ్ షో ( Sam Jam talk show ) మధ్యలోనే ఆపేసినట్టు అవుతుంది. అయితే, దీనివెనుకున్న కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.


Also read : Samantha Akkineni: సమంత సామ్ జామ్ షోకు నాగచైతన్య, అఖిల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook