Samantha Akkineni: 10 అంతర్జాతీయ భాషల్లో సమంత క్రేజీ ప్రాజెక్ట్

సమంత అక్కినేని నటిస్తున్న ఫేమస్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్-2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా తాజాగా ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ మరో అప్‌డేట్ వచ్చింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌ను మొత్తం 10 అంతర్జాతీయ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Jan 1, 2021, 10:41 PM IST
Samantha Akkineni: 10 అంతర్జాతీయ భాషల్లో సమంత క్రేజీ ప్రాజెక్ట్

సమంత అక్కినేని నటిస్తున్న ఫేమస్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్-2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా తాజాగా ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ మరో అప్‌డేట్ వచ్చింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌ను మొత్తం 10 అంతర్జాతీయ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎప్పుడో ఆడియెన్స్ ముందుకు రావాల్సి ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇంత ఆలస్యమవుతున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. రాజ్ నిడిమోరు, క్రిష్ణ డికె ద్వయం డైరెక్ట్ చేస్తోన్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత పాకిస్థాన్ టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తోంది.

ది ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్‌లో సమంతతో పాటు మనోజ్ బాజ్‌పేయ్ ( Manoj Bajpayee ), ప్రియమణి ( Priyamani ), శరద్ ఖేల్‌కర్, శరీబ్ హష్మి, జేకే తల్పడే, శ్రేయ ధన్వంతరి, అర్వింద్ దర్శన్ కుమార్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ మొదటి భాగానికి వచ్చిన భారీ స్పందన రెండో భాగానికి భారీగా బూస్టింగ్ ఇచ్చేలా చేసింది. 

Also read : Samantha as Pakistan terrorist: పాకిస్థాన్ టెర్రరిస్టుగా సమంత

భారత్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ ( The Family Man 2 web series ) విడుదల కానుండగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 అంతర్జాతీయ భాషల్లోకి దీనిని డబ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. తొలిసారిగా సమంత అక్కినేని ( Samantha Akkineni ) సైన్ చేసిన వెబ్ సిరీస్ కూడా ఇదే కావడంతో సమంత వైపు నుంచి కూడా ఈ క్రేజీ ప్రాజెక్టుకి రావాల్సినంత పబ్లిసిటీ లభిస్తోంది. 

Also read : Samantha Akkineni: సమంత సామ్ జామ్ షోకు నాగచైతన్య, అఖిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News