Samyukta Menon Angry on SVCC Production House: భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల ధనుష్ హీరోగా రూపొందిన సార్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో రూపందగా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ భామ తాజాగా విరూపాక్ష సినిమాలో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు రంగం సిద్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన ఆవేదన వ్యక్తం చేసే ముందు విరూపాక్ష సినిమాతో తన జర్నీ చాలా అద్భుతమైనదని ఆమె పేర్కొంది. ఇలాంటి టెక్నీషియన్ లతో తాను పని చేయాలని ఎప్పటినుంచి ఆశించానని అది ఈ సినిమాతో తీరిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ను ట్యాగ్ చేస్తూ మీరు ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు? ఉగాది సందర్భంగా నా క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేస్తానని మీరు హామీ ఇచ్చారు.


కానీ అలాంటిదేమీ జరగలేదు, ఎందుకు అంటూ ఆమె ప్రశ్నించింది. అయితే ఈ పోస్ట్ కోపంగా పెట్టారా లేక సరదాగా పెట్టారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఆమె పెట్టిన పోస్ట్ కి సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు అభిమానులైతే రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక విరూపాక్ష సినిమాకి సంబంధించి ఇటీవల టీజర్ విడుదల చేయగా ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ అయితే లభించింది.


కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ ఈ సినిమాకి కథ అందించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సునీల్, అజయ్, బ్రహ్మాజీ, రాజశేఖర్ అనిమి వంటి వారు ఇద్దరు కీలక పాత్రలలో నటిస్తున్నారు.


Also Read: Blast at Tamilnadu: పండుగ పూట పెను విషాదం.. ఎనిమిది మంది సజీవ దహనం?


Also Read: Modi Htao Desh Bachao : కలకలం రేపుతున్న మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లు.. ఆరుగురు అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook