Sania Mirza: విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి? విడాకులపై సానియా కొత్త అనుమానాలు!
Sania Mirza shares cryptic post: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Sania Mirza shares cryptic post on divorce speculations with Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇద్దరూ పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య అంతా బాగాలేదని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య దూరం పెరుగుతోందని, వీరిద్దరూ ఏకంగా విడాకులు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి వీరిద్దరికీ పెళ్లయి దశాబ్దం దాటింది ఇప్పటివరకు అసలు వీరి మధ్య ఎలాంటి వివాదం లేదని భావిస్తూ ఉండగా తొలిసారిగా ఇలాంటి విబేధాల వార్త తెరపైకి వచ్చింది.
అయితే సానియా మీర్జా తాజా ఇన్‌స్టా కథనం దీనికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. "విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి? అని ప్రశ్నిస్తూ ఉండగా దానికింద అల్లాను కనుగొనడానికి" అని షేర్ చేశారు. ఈ పోస్ట్ ను చూసిన తరువాత ఆమె అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు వారి మధ్య విభేదాల వెనుక ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు, కానీ పాకిస్తాన్ నుండి వచ్చిన కొన్ని మీడియా నివేదికలు షోయబ్ మాలిక్ తన టీవీ షోలలో ఒక దానిలో సానియాతో మోసం చేశాడని సూచిస్తున్నాయని అంటున్నారు.
ఇక ఈ జంట ఇప్పుడు విడిపోయారని, గత కొంత కాలంగా విడి విడిగా జీవిస్తున్నారని పాక్ మీడియా చెబుతోంది. అయితే ఈ పుకార్లపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. వారిద్దరూ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకోగా ఇద్దరికీ నాలుగేళ్ల క్రితం ఒక కుమారుడు జన్మించారు. ఈ జంట ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టినరోజును దుబాయ్‌లో గ్రాండ్ గా జరిపారు. ఈ ఫోటోలను షోయబ్ మాలిక్ కూడా పంచుకున్నారు.
ఇక సానియా మీర్జా ఇలా అనుమానాలు రేకెత్తించేలా పోస్ట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. కొన్ని రోజుల క్రితం ఆమె తన కుమారుడితో ఉన్న ఫోటోను షేర్ చేసి "నన్ను కష్టతరమైన రోజుల్లో పొందే క్షణాలు" అనే కామెంట్ చేసింది. నిజానికి షోయబ్ మాలిక్ మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి, ఈ విషయం తెలుసుకున్న సానియా మీర్జా చాలా బాధపడిందని అంటున్నారు. ఆ వివాదం తరువాత ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook