Heroines Accidents : మన హీరోయిన్లకు ఏమైంది.. ఒకరికి అరుదైన వ్యాధి మరొకరికి యాక్సిడెంట్.. ఇద్దరికి కాలి ఫ్రాక్చర్!

Heroines Back to Back Accidents : సమంత మొదలు పూజా హెగ్డే, త్రిష, రంభ వంటి వారు అనారోగ్యం పాలవుతూ ఉండడం, ప్రమాదాల బారిన పడుతూ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 8, 2022, 03:53 PM IST
Heroines Accidents : మన హీరోయిన్లకు ఏమైంది.. ఒకరికి అరుదైన వ్యాధి మరొకరికి యాక్సిడెంట్.. ఇద్దరికి కాలి ఫ్రాక్చర్!

Heroines Back to Back Accidents : ఇటీవల వరుసగా హీరోయిన్లు అనారోగ్యం పాలవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.  సమంత తాను ఒక ప్రాణాంతక వ్యాధి భారిన పడినట్లుగా కొద్దిరోజులు కదా ప్రకటించడం ముందు చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం అది అంత ప్రాణాంతకం ఏమీ కాదని ప్రస్తుతానికి తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చింది. అయితే సమంత అనారోగ్య పరిస్థితి గురించి ప్రకటించిన రోజైతే ఆమె త్వరలో చనిపోతుందా అన్నట్లుగా మీడియాలో హడావుడి మొదలైంది.

 దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు సైతం త్వరగా కోలుకొని మన మధ్యకు రావాలి అంటూ పోస్టులు పెట్టడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో అలాంటిదేమీ లేదని చచ్చిపోయే అవకాశం లేదని సమంత వ్యంగంగా కామెంట్ చేయడంతో ఆ ప్రచారానికి కాస్త ఫుల్ స్టాప్ పడినట్టే. అయితే సమంత మాత్రమే కాకుండా వరుసగా హీరోయిన్లు ప్రమాదాలకు, అనారోగ్యాలకు గురవుతూ ఉండడం చర్చనీయాంశమైంది.

ఇటీవల మాజీ హీరోయిన్ రంభ కెనడాలో కారు ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే ఆమె కుమార్తెకు మాత్రం గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. మరోపక్క పూజా హెగ్డే కూడా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టలేదు కానీ ఆమె కాలికి గాయమైన విషయం బయటకు రావడంతో ఈ విషయం బయటపడింది. ఇక మరో హీరోయిన్ త్రిష కూడా ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో హిట్ కొట్టింది.

ఆ సినిమా సూపర్ హిట్ అందుకోగా ఆ సక్సెస్ ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెకేషన్ కి వెళితే అక్కడ అనుకోకుండా కాలికి గాయం చేసుకుంది. ఇక ఈ సంఘటనలు అన్నీ చూస్తున్నవారు ప్రస్తుతానికి తెలుగు హీరోయిన్లకు ఏమైంది? ఎందుకిలా వారంతా ప్రమాదాల బారిన పడుతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రమాదాలు, అనారోగ్యాల వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 
Also Read: Arjun Sarja to Replace Vishwak: కుర్ర హీరో వెంట పడుతున్న అర్జున్ సర్జా.. విశ్వక్ కు దెబ్బ కొట్టేలా ప్లానింగ్!

Also Read: Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News