Arjun Sarja to Replace Vishwak: కుర్ర హీరో వెంట పడుతున్న అర్జున్ సర్జా.. విశ్వక్ కు దెబ్బ కొట్టేలా ప్లానింగ్!

Arjun Sarja Trying Hard for Sharwanand: అర్జున్ సర్జా -విశ్వక్ సేన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా వివాదంలో పడడంతో ఆ సినిమాలోకి శర్వానంద్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 8, 2022, 03:22 PM IST
Arjun Sarja to Replace Vishwak: కుర్ర హీరో వెంట పడుతున్న అర్జున్ సర్జా.. విశ్వక్ కు దెబ్బ కొట్టేలా ప్లానింగ్!

Arjun Sarja Trying Hard to Rope in Sharwanand: టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హీరో విశ్వక్సేన్ మధ్య ఏర్పడిన వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఒక తెలుగు సినిమాలో విశ్వక్సేన్ హీరోగా ఎంపికయ్యారు. అదే సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ వంటి వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.

దీంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా అటు విశ్వక్సేన్ కు ఇటు అర్జున్ కుమార్తెకు ప్లస్ అవుతుందని భావిస్తున్న తరుణంలో అర్జున్ సినిమా నుంచి విశ్వక్సేన్ తప్పుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తరువాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అర్జున్ విశ్వక్సేన్ తప్పుకోవడం ఏమిటి నేనే అతనితో సినిమా చేయడం లేదని ప్రకటించారు. ఆ తర్వాత కూడా విశ్వక్సేన్ తెర మీదకు వచ్చి తన తప్పేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేశాడు.

అయితే అర్జున్ మాత్రం 100 కోట్లు ఇచ్చిన విశ్వక్సేన్ తో సినిమా చేసే ప్రసక్తే లేదని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథ కోసం మరో తెలుగు హీరోని వెతికే పనిలో పడ్డారు. తాజాగా ఈ సినిమా కథను యంగ్ హీరో శర్వానంద్ కి నేరేట్ చేశారని తెలుస్తోంది. ఈ కథకు శర్వానంద్ అయితే 100% న్యాయం చేయగలరని భావిస్తున్న అర్జున్ అతని డేట్స్ ఎలా అయినా సంపాదించాలనే ఉద్దేశంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ ఇటీవల ఒకే ఒక జీవితం అనే సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఆయన ప్రస్తుతానికి కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా పూర్తయిన తర్వాత కూడా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు షూటింగ్ జరపాల్సిన క్రమంలో శర్వానంద్ అర్జున్ సర్జా ఆఫర్ ఒప్పుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి అర్జున్ సర్జా మేనల్లుడు చిరంజీవి సర్జా కన్నడలో మీడియం రేంజ్ హీరోగా ఉండేవారు. అయితే గత ఏడాది అనూహ్యంగా ఆయన మృత్యువాత పడ్డారు. ఆయన సోదరుడు ధృవ్ సర్జా కూడా పొగరు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కానీ అతనితో సినిమా చేస్తే తెలుగు మార్కెట్ కలిసి రాదనే ఉద్దేశంతోనే ఇలా బయట హీరోల కోసం అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Dil Raju Love Today: అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. ఆ సూపర్ హిట్ మీద కన్ను.. తెలుగులో రిలీజ్!

Also Read: Shreya Dhanwanthary Hot Photos: రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. నూలు పోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News