Sanjay Dutt: సంజయ్ దత్‌కి అస్వస్థత.. కరోనా పరీక్షలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) శనివారం రాత్రి అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) శనివారం రాత్రి అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుండటం కరోనా లక్షణాల్లో ( Coronavirus symptoms ) ఒకటి కావడంతో ముందుగా వైద్యులు ఆయనకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఐతే, ఈ పరీక్షల్లో రిపోర్టు నెగెటివ్‌గా రావడంతో సంజయ్ దత్ కుటుంబసభ్యులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. Also read: రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి ఫోటోలు
సంజయ్ దత్ తాను ఆస్పత్రిలో చేరడంపై ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) రిపోర్టు నెగెటివ్‌గానే వచ్చిందని సంజయ్ దత్ ట్వీట్ చేశాడు. ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందిస్తున్న మెరుగైన చికిత్స కారణంగా ఒకట్రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చేస్తానని సంజయ్ దత్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. Also read: యుజ్వేంద్ర చాహల్ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ ఫోటోలు.. చాహల్ గాళ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా ?