Alia Bhatt Gangubai Kathiawadi Official Trailer is Out: కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గంగూబాయ్‌ కతియావాడీ'. ముంబై మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని బన్సాలీ - జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మించారు. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంగూబాయ్‌ కతియావాడీ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 4) చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. 'కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్‌ ఉంటుంది' అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభం కాగా.. కారులో ఆలియా భట్‌ ఎంట్రీ ఇస్తుంది. 'మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ రోజు రాత్రి మేము ఇజ్జత్ అమ్ముతాం', 'కామాఠిపుర రజియా భాయ్ సొంతం', 'రజియా భాయ్ పేరు చెపితే వాంతులు వస్తున్నాయి'. అమ్మ పేరు ఒకటి చెపితే చాలదా?'అనే డైలాగ్స్ హైలెట్ అయ్యాయి.


ట్రైలర్‌లో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ వన్ మ్యాన్ షో చేసిందనే చెప్పాలి. అలియా నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇంత చిన్న వయస్సులోనే అంత పెద్ద పాత్రను పోషించి అందరిచేత ఔరా అనిపించింది. ఈ సినిమాతో అమ్మడు రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. సంజయ్ లీలా భన్సాలీ చేతిలో పడితే ఎవరైనా పెద్ద స్టార్ కావాల్సిందే మరి. ఇది ఇప్పటికే రుజువైంది కూడా. ఎందరో స్టార్ హీరో, హీరోయిన్‌లు భన్సాలీ సినిమాలతోనే పాపులర్ అయ్యారు. 



 


'గంగూబాయ్‌ కతియావాడీ' చిత్రంలో గట్సీ వేశ్యా గృహ నిర్వాహకురాలుగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఎస్ హుస్సేన్ జాడి రచించిన 'మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై' నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.


 


ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకుంది. గంగూబాయ్‌ కతియావాడీ సినిమా మార్చి 25న ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.


Also Read: AP Treasury: ట్రెజరీ ఉద్యోగులకు మరో షాక్.. ఆదివారం విధులకు రావాలని ప్రభుత్వ ఆదేశాలు



Also Read: Numerology Predictions: ఏయే తేదీల్లో పుట్టినవారికి ఇవాళ కలిసొస్తుంది.. న్యూమరాలజీ ఏం చెబుతోంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook