Santosh Shoban Mehreen Pirzada's Manchi Rojulochaie Release Trailer out: డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన సినిమా.. మంచి రోజులు వచ్చాయి (Manchi Rojulochaie). ‘ఏక్ మినీ కథ’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Shoban) నటిస్తోన్న సినిమా ఇది. సంతోష్ శోభన్ కు జోడీగా మెహ్రీన్ (Mehreen) నటిస్తోంది. ఈ మూవీ దీపావళికి (Diwali) ప్రేక్షకుల ముందుకు రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక గత వారం వచ్చిన ట్రైలర్ కామెడీని ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో వారం రోజులే సినిమా విడుదలకు ఉండడంతో యూనిట్ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ (Pre-release) వేడుకను నిర్వహించింది మంచి రోజులు వచ్చాయి టీమ్. ఇక మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ (Release Trailer) ను కూడా వచ్చేసింది. మంచి రోజులు వచ్చాయి మూవీ రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. 



Also Read : Ravi Tejas 70th film : రవితేజ 70వ సినిమా అనౌన్స్‌మెంట్


రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంది. మారుతి బ్రాండ్ రొమాన్స్ తో పాటు సిట్యుయేషనల్ కామెడీ సినిమాలో ఎక్కువే ఉన్నట్లుంది. అజయ్ ఘోష్, (Ajay Ghosh) వెన్నెల కిషోర్, సప్తగిరి, సుదర్శన్, వైవా హర్ష, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితర కమెడియన్లంతా మూవీలో ఉన్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా (Romantic entertainer) తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. 


వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న (November 4) దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న మంచి రోజులు వచ్చాయి (Manchi Rojulochaie) థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమంటున్నారు దర్శకుడు మారుతీ (Maruthi).


Also Read : Puneeth Rajkumar's death: పునీత్ రాజ్‌కుమార్ మృతికి అసలు కారణం ఇదేనా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook