సారా అలీఖాన్... ఈమె ఎవరో గుర్తుపట్టారు కదా!! అవును మీ గెస్ కరెక్టే.. సైఫ్ అలీ ఖాన్ కూతురు.. రెండేళ్ల క్రితమే బాలీవుడ్‌కి పరిచయమైన కొత్త హీరోయిన్ సారా అలీ ఖాన్. కేదార్‌నాథ్, సింబ, లవ్ ఆజ్ కల్ వంటి చిత్రాలు చేసి ప్రస్తుతం కూలీ నెంబర్ 1, అత్రంగీ రే చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్‌ని తాజాగా సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె తన సోదరుడు ఇబ్రహీంతో కలిసి బికినీలో ఫోటోలకు ఫోజివ్వడమే. తమ్ముడు ఇబ్రహీం పుట్టిన రోజు నాడు తమ్ముడికి శుభాకాంక్షలు చెబుతూ సారా అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు పోస్ట్ చేసింది. హీరోయిన్ బికినీలో ఫోటోలకు ఫోజిస్తే.. ఎవరికైనా కన్నులపండుగే కానీ ఈ విషయంలో ఆమె తన సోదరుడితో బికినీలో ఫోటోలకు ఫోజివ్వడమే కాస్త వివాదాస్పదమైంది. తమ్ముడితో కలిసి ఈ పిచ్చివేషాలేంటంటూ నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సారా అలీ ఖాన్ ఇచ్చిన ఫోజు ఆమె సోదరుడు ఇబ్రహీంకు సైతం ఇబ్బందిగానే అనిపించి ఉంటుందని.. అతడు ఆమెపై ఎప్పటిలా చెయ్యి వెయ్యలేక పోతున్నట్టు నిలబడటం చూస్తేనే ఆ విషయం అర్థమవుతోందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఫోటోకు ఫోజిచ్చినట్టుగా సోదరుడితో కలిసి ఇలా ఫోటోలకు ఫోజివ్వడం కరెక్ట్ కాదంటూ నెటిజెన్స్ సారాఅలీ ఖాన్‌పై ఫైర్ అవుతున్నారు. ఇదిలావుంటే, తమ్ముడితో కలిసి బికినీలో ఫోజిస్తే తప్పేంటి అని ఆమెకు అండగా నిలుస్తున్న వాళ్లు కూడా కొంతమంది లేకపోలేదు. అయితే మెజారిటీ నెటిజెన్స్ మాత్రం సారా వ్యవహరంపై గుర్రుగానే ఉన్నారు.