Saripodha Sanivaram First Review:‘సరిపోదా శనివారం’ సినిమా ఫస్ట్ రివ్యూ.. నాని హిట్ కొట్టినట్టేనా..!
Saripodha Sanivaram First Review: నాచురల్ స్టార్ నాని తెలుగులో ఒక మూసకు పరిమితం కాకుండా వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న వంటి డిఫరెంట్ మూవీస్ తో వరుస సక్సెస్ లు అందుకున్న నాని.. ఇపుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో హాట్రిక్ హిట్ పై కన్నేసాడు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ మూవీ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..
Saripodha Sanivaram First Review: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక రకమైన పాత్రలకు పరిమితం కాకుండా క్లాస్ అండ్ మాస్ చిత్రాలతో అలరిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన ‘సరిపోదా శనివారం’ సినిమాతో పలకరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా నాని కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రంలో నాని సూర్య అనే పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు కోపాన్ని అణుచుకునే వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయినట్టు సమాచారం. కేవలం వారంలో శనివారం మాత్రమే తన కోపాన్ని బహిర్గతం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగిందేనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక రకంగా మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పాలి. కల్కి తర్వాత మంచి మాస్ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న ఆడియన్స్ కు నాని ‘సరిపోదా శనివారం’ సినిమా సరిపోయేంత వినోదం పంచడం ఖాయం అని చెబుతున్నారు.
ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు నాని ఢీకొట్టే విలన్ పాత్రలో ఎస్.జే.సూర్య తన పాత్రలో జీవించాడని చెబుతున్నారు. ఈ మూవీ నాని కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
ఈ సినిమా తెలంగాణ (నైజాం).. రూ. 12.50 కోట్లు
రాయలసీమ (సీడెడ్).. రూ. 5 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్.. రూ. 12.50 కోట్లు..
మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 5 కోట్లు..
ఓవర్సీస్ .. రూ. 6 కోట్లు బిజినెస్
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కానీ ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరి నాని ఈ సినిమాతో హాట్రిక్ హిట్ నమోదు చేస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి