సినిమాలకు మ్యూజిక్ అందిస్తూనే నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మధ్యమధ్యలో తనవంతు ప్రయత్నాలు చేస్తోన్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ మరోసారి నటుడిగా చేసిన సినిమా సర్వం తాళమయం. రాజీవ్ మీనన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో సర్వం తాళమయం పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. సంగీతమే ప్రధాన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్, రాజీవ్ మీనన్, త్యాగరాజ పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఏ.ఆర్.రెహ్మాన్, ఖుతుబ్ ఏ క్రిప బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డిసెంబర్ నెలాఖర్లో విడుదల కానున్న ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ సరసన మళయాళం నటి అపర్ణ బాలమురళి జంటగా నటించింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.