Sathyameva Jayathe​ Song From Pawan Kalyan​s Vakeel Saab Movie: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఇదివరకే ఈ మూవీ నుంచి మగువా మగువా లిరికల్ సాంగ్ విడుదలై సక్సెస్ సాధించగా.. మరో పాట ‘సత్యమేవ జయతే’ తాజాగా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ  సాంగ్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఏప్రిల్ 9వ తేదీన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ థియేటర్లకు రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ మూవీని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బుధవారం నాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ‘సత్యమేవ జయతే’ లిరికల్ సాంగ్ వచ్చేసింది.


Also Read: Prabhas: టాలీవుడ్‌కు దూరం కానున్న ప్రభాస్, ముంబైలోనే మకాం



ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ‘సత్యమేవ జయతే’ పాటకు చక్కని సాహిత్యం అందించి ప్రాణం పోశారు. ఫేమస్ సింగర్ శంకర్ మహదేవన్, పృథ్వీ చంద్ర, ఎస్ థమన్ కలిసి అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ స్వరాలు సమకూర్చారు.


Also Read: Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr !


ఇదివరకే విడుదలైన ట్రైలర్(Vakeel Saab Teaser)‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో వచ్చిన పింక్ సినిమా తెలుగు రీమేక్ ఈ వకీల్ సాబ్. హిందీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. కెరీర్‌లో తొలిసారి లాయర్ పాత్రలో నటించడంతో మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ నెలకొంది.


Also Read: Richa Gangopadhyay Pregnancy: తన అభిమానులకు శుభవార్త చెప్పిన మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook