Richa Gangopadhyay Pregnancy News: టాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమా లైఫ్ వదిలేసిన మిర్చి ఫేమ్ రిచా తాను తల్లికాబోతున్నట్లు అభిమానులకు శుభవార్త చెప్పారు. నేటి ఉదయం ట్విట్టర్ వేదికగా ఈ శుభవార్త చెబుతూ ఓ ఫొటో షేర్ చేసుకున్నారు.
గత కొంతకాలం నుంచి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాం. ఎట్టకేలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని మీకు ఈ శుభవార్త చెబుతున్నాం. బేబీ లాంగెల్లా త్వరలో ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మేం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం. మా చిన్నారి ఎప్పుడెప్పుడు వస్తుందో చూడాలని ఎదురుచూస్తున్నామని Tollywood నటి రిచా గంగోపాధ్యాయ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
Also Read: Saranga Dariya Video Song: సెన్సేషన్‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్
We've been keeping a LITTLE secret 🤫
Joe and I are so excited to finally share with everyone....
BABY LANGELLA COMING THIS JUNE!
Our hearts are so full of happiness and gratitude 🌺. We can't wait to meet our little bundle of joy! 👶🏻💖🤰🏻 pic.twitter.com/bSmO6GyUFo
— Richa Langella (Gangopadhyay) (@richyricha) February 28, 2021
కాగా, టాలీవుడ్‌కు దగ్గుబాటి రానా(Rana Daggubati) నటించిన లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మాస్ మహరాజ్ రవితేజతో సారొచ్చారు, మిరపకాయ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా నాగవల్లి సినిమాలో తన నటనతో భేష్ అనిపించుకున్నారు. చివరగా భాయ్ సినిమాలో తెరమీద కనిపించింది. కానీ అవకాశాలు తక్కువ కావడంతో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు.
Also Read: Check movie review: చెక్ మూవీ రివ్యూ, రేటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook