Sunny Leone: నెక్ట్స్ సెమిస్టర్ లో కలుద్దాం అంటున్న సన్ని లియోన్
మాజీ అడల్ట్ మూవీ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోన్ ( Sunny Leone ) గురించి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది.
మాజీ అడల్ట్ మూవీ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోన్ ( Sunny Leone ) గురించి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. కోల్‌కతాలోని ఆషుతోష్ కాలేజీ ఎంట్రెన్స్ పరీక్షలు ( Exams ) లో టాపర్ గా ఆమె పేరు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ( Social Media ) ట్రోలింగ్ స్టార్ట్ అయింది.
మెరిట్ లిస్టులో ఆమె పేరు రావడం.. అది కూడా నెంబర్ వన్ ర్యాంకు రావడంతో ఆమె గురించి, ఆషుతోష్ కాలేజీ గురించి జోకులు పేలుస్తున్నారు. అయితే తాజాగా సన్నీ లియన్ కూడా ఈ వార్తపై స్పందించింది.
సన్ని లియోన్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ మెరిట్ లిస్టు గురించి కామెంట్ చేసింది. వచ్చే సెమిస్టర్ లో కాలేజీలో కలుద్దాం. మీరు నా క్లాస్ మేట్ అవుతారు ఆశిస్తున్నా అని చమత్కరించింది.
కాగా ఈ మెరిట్ లిస్టుపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ఎవరో ఆకతాయిగా ఈ పని చేసి ఉంటారు అని.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపింది.