Sekhar Master Daughter Sahithi Dance: సారంగదరియా పాటకు శేఖర్ మాస్టర్ కూతురి డ్యాన్స్ అదుర్స్
DanceDariyaChallenge : సారంగదరియా పాటకు డ్యాన్స్ మాస్టర్.. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి ఇది వరకే ఓ ఈవెంట్‌లో ఆ స్టెప్పులు వేసింది. అయితే ఇప్పుడు మరోసారి సాహితి రచ్చ చేసింది.
Sekhar Master Daughter Sahithi MASS Dance for saranga dariya song to AHA DanceDariyaChallenge: లవ్ స్టోరీ మూవీలోని ‘‘సారంగ దరియా’’ సాంగ్ ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాట సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్సిన సారంగ దరియా పాట.. (saranga dariya song) అతి తక్కువ కాలంలోనే 25కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. తాజాగా 30 కోట్ల మార్కును దాటింది. దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో సాంగ్‌కు సాధ్యంకాని రికార్డును దక్కించుకుంది ‘‘సారంగ దరియా’’ సాంగ్. రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ (Singer Mangli) పాడింది. ఈ పాటలో సాయి పల్లవి (Sai Pallavi) తన క్యూట్ లుక్స్‌తో.. స్టెప్పులతో అదరగొట్టింది.
Also Read : Pushpa movie Sami Sami Song: ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ వెంటపడుతోన్న శ్రీవల్లి
ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సారంగదరియా పాటకు డ్యాన్స్ మాస్టర్.. శేఖర్ మాస్టర్ (Shekhar Master) కూతురు సాహితి (Sahithi) ఇది వరకే ఓ ఈవెంట్‌లో ఆ స్టెప్పులు వేసింది. అయితే ఇప్పుడు మరోసారి సాహితి రచ్చ చేసింది. సారంగదరియా పాటకు తన స్టైల్‌లో డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది. తన కూతురు చేసిన డ్యాన్స్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు శేఖర్ మాస్టర్. మీరు కూడా మీ వెర్షన్‌లో సారంగదరియా పాటకు డ్యాన్స్ చేసి డ్యాన్స్ దరియా (DanceDariya) కాంపిటేషన్‌లో పాల్గొని మాకు మీ వీడియో పంపించండి అని కోరాడు. బాగా చేసిన వారిలోంచి ఐదు గురికి "ఆహా" నుంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని శేఖర్ మాస్టర్ (Shekhar Master) చెప్పుకొచ్చాడు.
Also Read : Viral Video: నడి రోడ్డుపై తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన సీనియర్ నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook