Extra Ordinary Man Update: టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్‌ (Nithiin) నయా మూవీ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' (Extra Ordinary Man). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల (Sreeleela) నటిస్తోంది. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ డాక్టర్ రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలియజేశారు మేకర్స్. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాజశేఖర్ మేకప్‌ వేసుకొని క్యారవాన్‌లో నుంచి దిగుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన డేంజర్‌ పిల్లా లిరికల్ సాంగ్‌ను ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా డిసెంబరు 08న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా కొత్త లుక్ ను విడుదల చేశారు మేకర్స్. 



నితిన్ ఈ చిత్రంతోపాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ VNRTrio అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురు కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన నితిన్‌ లుక్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 


Also Read: Saindhav Teaser: 'సైంధవ్' టీజర్ వచ్చేసింది.. వెంకీ మామా వైలెన్స్ అదుర్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి