Madhubala Deja Vu Movie : కొన్ని చిత్రాలు థియేటర్లో మాత్రమే ఆడతాయి. ఇంకొన్ని సినిమాలు ఓటీటీకే పరిమితం అవుతాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా, అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. థియేటర్లో, ఓటీటీల్లో ఇప్పుడు సినిమాలు మంచి ఆదరణను దక్కించుకుంటాయి. ఆ లిస్ట్‌లో డెజావు చిత్రం చేరింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డెజావు థియేటర్లో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మిమే గోపి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.


నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? మన ఊహా ప్రపంచం మన ముందు ఉంటే ఏం అవుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే డెజావు చిత్రం. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం.. చిత్రంపై ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తుంది. చివరి వరకు కూడా దర్శకుడు ఈ చిత్రాన్ని సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 


2022 జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇలాంటి సినిమాను మన తెలుగు వారికి అందించాలని భవాని డీవీడీ ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం మేజర్ ప్లస్‌ అయింది.


Also Read : kantara Movie Varaha roopam Song : కాంతారా నిర్మాతలకు దెబ్బ మీద దెబ్బ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు  


Also Read : Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook