Senior Actor VP Khalid Passes Away: దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మలయాళ చిత్ర సీమకు చెందిన ఒక నటుడు ఆకస్మికంగా మృతి చెందడంతో చిత్ర సీమ అంతా విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ మలయాళ నటుడు వీపీ ఖలీద్ కన్నుమూశారు. కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్ సమీపంలో ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే ఆయన మరణించాడు. వీపీ ఖలీద్‌కు 70 ఏళ్లు. ఆయన కేవలంలో సినిమాల్లోనే కాక నాటకరంగంలో కూడా మంచి అనుభవం కలిగి ఉన్నారు. ఖలీద్ మృతికి సంబంధించిన సమాచారాన్ని కేరళ పోలీసులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సినిమా సెట్స్‌లోని టాయిలెట్‌లో ఖలీద్ మృతదేహం పడి ఉన్నట్లు షూట్ వర్గాలు గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సినిమా యూనిట్‌లోని ఇతర సభ్యులు ఆయనని సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. షూటింగ్ లొకేషన్‌లో అల్పాహారం తీసుకున్న తర్వాత ఖలీద్ టాయిలెట్‌కు వెళ్లినట్లు సమాచారం. 


ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆయనని వెతుకుతూ వెళ్ళడంతో టాయిలెట్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. మలయాళ సినిమాల్లోనే కాకుండా టీవీ షోలలో కూడా ఆయన సత్తా చాటారు. ప్రముఖ మలయాళ కామెడీ సీరియల్‌లో కీలక పాత్ర చేసిన తర్వాత ఖలీద్ బాగా ఫేమస్ అయ్యారు. మలయాళ సినీ రంగానికి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు జిమ్షీర్,  షిజు ఖలీద్ అలాగే దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ ముగ్గురూ ఆయన కుమారులు. 


ఖలీద్ ఆకస్మిక మరణంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో,  ఖలీద్ మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఖలీద్ మరణంతో మలయాళ చిత్రసీమలో శోకసంద్రం నెలకొంది. ప్రతి ఒక్కరూ మరణించిన ఆ సీనియర్ నటుడ్ని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.  టోవినో థామస్ హీరోగా ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్లోనే ఆయన గుండెపోటుతో మరణించాడని పోలీసులు భావిస్తున్నారు. 


Also Read: Karan Johar about Shahrukh Khan : షారుక్‌ ఖాన్‌తో శారీరక సంబంధం.. ఆ బుక్లో ఓపెన్ అయిన కరణ్‌ జోహార్


Also Read: Hemachandra - Sravana Bhargavi: విడాకుల దిశగా హేమచంద్ర.. ఆ పోస్టులు దానికే సంకేతమా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.