Karan Johar about Shahrukh Khan : షారుక్‌ ఖాన్‌తో శారీరక సంబంధం.. ఆ బుక్లో ఓపెన్ అయిన కరణ్‌ జోహార్

Karan Johar about Shahrukh Khan : గతంలో కరణ్ జోహార్ షారుక్ ఖాన్ తో కాస్త సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉందని కూడా అప్పట్లో బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 09:25 AM IST
  • కరణ్ జోహార్ షారుక్ ఖాన్ మధ్య ఏదో ఉందంటూ ప్రచారం
  • తన బుక్ 'అన్ సూటబుల్ బాయ్'లో ప్రస్తావించిన కరణ్ జోహార్
  • పాత సంగతే అయినా మరోమారు సోషల్ మీడియాలో వైరల్
 Karan Johar about Shahrukh Khan : షారుక్‌ ఖాన్‌తో శారీరక సంబంధం.. ఆ బుక్లో ఓపెన్ అయిన కరణ్‌ జోహార్

Karan Johar about Relation with Shahrukh Khan : తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా కరణ్ జోహార్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ ల అనేక సినిమాలకు దర్శకుడిగా,  నిర్మాతగా వ్యవహరించిన ఆయన కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా యాంకర్ గా కూడా మంచి ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం అయిన లైగర్ అనే సినిమాతో తెలుగులో కూడా నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. తండ్రి వారసత్వం అందుకుని తొలుత నటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత దర్శకుడిగా చేసిన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న కరణ్ జోహార్ తర్వాత ఎక్కువగా సినీ నిర్మాణం మీదే ఆసక్తి చూపించారు. 

తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్స్ లో సినిమాలు చేస్తూ ఎంతోమంది ఔత్సాహికులను స్టార్లుగా తీర్చిదిద్దారు. అయితే ఇదంతా ప్రొఫెషనల్ సైడ్ అయితే ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో షారుక్ ఖాన్ తో కాస్త సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే అదేమీ పర్సనల్ గా కాదు ఒక వేదిక మీదే వారిద్దరూ కాస్త సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉందని కూడా అప్పట్లో బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించింది. 

ఈ విషయం మీద కరణ్ జోహార్ స్పందించారు. ఆయన స్వయంగా స్పందించలేదు కానీ తాను రాసుకున్న అన్ సూటబుల్ బాయ్ అనే బుక్ ద్వారా ఈ ఎపిసోడ్ లో తాను ఎంత బాధ పడ్డాను అనే విషయాన్ని వెల్లడించారు. ఈ సంగతి పాతదే అయినా ఇప్పుడు మరోమారు సోషల్ మీడియాలో వైరలవుతోంది. షారుక్ ఖాన్ తనకు ఒక తండ్రి లాంటివాడని ఒక అన్నలా అన్ని విషయాలు గైడ్ చేసేవాడని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తితో లైంగిక సంబంధం ఉందా అని అడగడంతో తనకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యిందని,  ఒక యాంకర్ ముఖం మీద ఈ ప్రశ్న అడగడంతో నేను కూడా మీ అన్నతో నువ్వు పడుకుంటావా అని అడిగాను అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. 

అయితే ఈ విషయం మీద షారుక్ ఖాన్ మాత్రం చాలా అండగా ఉండేవారని ఆ పుకార్లను లెక్కచేయవద్దని అనేవారని అన్నారు. వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడతారని,  పెళ్లయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోలేదంటే గే అని రాసేస్తారు. అవేం పట్టించుకోకు అని నాకు ధైర్యం చెప్పేవాడని కరణ్ రాసుకొచ్చాడు. అలాగే శారీరిక సంబంధం పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అని,  ఒకరితో శృంగార సంబంధం ఏర్పరచుకోవడం అంటే అది అంత ఆషామాషీ వ్యవహారం కాదని తాను నమ్ముతా అని రాసుకొచ్చారు. అది ఎవరి విషయంలోనైనా వ్యక్తిగతమే అంటూ ఆయన కామెంట్ చేశారు.
Also Read: Hemachandra - Sravana Bhargavi : విడాకుల దిశగా హేమచంద్ర.. ఆ పోస్టులు దానికే సంకేతమా?

Also Read: Revanth Reddy Meets Bandla Ganesh : అప్పుడు డిస్మిస్ చేయాలన్నాడు.. ఇప్పుడేమో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News