యాంకర్ ప్రదీప్ మాచిరాజు ..హీరోగా తెరకెక్కుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?' టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా.. పాటతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.  ఈ సినిమాలోని పాట 'నీలి నీలి ఆకాశం..'ను జనవరి 31న విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు దాదాపు 4.3 కోట్ల మంది ఈ పాటను వీక్షించడం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Read Also: మధ్యప్రదేశ్ సర్కారులో మంట..!!


'30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?' సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమా అయినప్పటికీ ఈ  సినిమాను మంచి దృశ్యకావ్యంగా మలిచారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రదీప్ మాచిరాజు చక్కని నటనా ప్రతిభను ప్రదర్శించారని దర్శక నిర్మాతలు తెలిపారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్‌లో సిద్ శ్రీరాం పాడిన ఈ పాట మ్యూజిక్ ప్రియుల మనసు దోచుకుంటోంది.


Read Also: అందుబాటులోకి వాట్సప్ కొత్త ఫీచర్..!!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..