మీరు వాట్సప్ వాడుతున్నారా..? ఐతే ఈ సరికొత్త ఫీచర్‌ను కూడా ఆనందించండి. అవును.. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్.. తమ వినియోగదారులకు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్నవాట్సప్ నేటి నుంచి .. మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం 'డార్క్ మోడ్'ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఫీచర్ నేటి నుంచి అందుబాటులో ఉంటుందని వాట్సప్ సంస్థ తెలిపింది. నిజానికి దీని కోసం సంస్థ..చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికి ప్రయత్నాలు ఫలించాయి.
Read Also: మధ్యప్రదేశ్ సర్కారులో మంట..!!
వాట్సప్‌లో 'డార్క్ మోడ్' వల్ల కొత్త అనుభవం కలుగుతుందని వాట్సప్ సంస్థ తెలిపింది. అంతే కాదు వినియోగదారుల కళ్లపై భారం పడకుండా ఉంటుందని వివరించింది. రాత్రి పూట లైట్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల పర్యావరణహితంగా ఉంటుందని వెల్లడించింది. అంతే కాదు రాత్రిపూట .. మెసేజ్‌లు చదివే సామర్థ్యం కూడా పెరుగుతుందని... కంటి అలసట తగ్గుతుందని తెలిపింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వివరించింది.
ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 వెర్షన్లు వాడే వినియోగదారులకు 'డార్క్ మోడ్' అందుబాటులో ఉంటుంది. ఐతే ఆండ్రాయిడ్ 9 వెర్షన్ లేదా అంతకంటే వాడే వినియోగదారులు వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్, ఆ తర్వాత థీమ్‌లోకి వెళ్లి 'డార్క్'ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని వాట్సప్ సంస్థ వివరించింది. ఐతే కొత్తగా వాట్సప్ ను డౌన్ లోడ్ చేసుకునే వినియోగదారులకు డార్క్ మోడ్ నేరుగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..