Shaadi Mubarak Trailer released: తెలుగు బుల్లితెరపై మొగలి రేకులు టీవీ సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న Sagar RK Naidu హీరోగా చేస్తున్న సినిమా షాదీ ముబారక్. పద్మశ్రీ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా మేకర్స్ Shaadi Mubarak Trailer విడుదల చేశారు. మార్చి 5న ఆడియెన్స్ ముందుకు రానున్న సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాతలు షాదీ ముబారక్ ట్రైలర్‌ను విడుదల చేశారు. కాసిన్ని బోల్డ్ డైలాగ్స్, ఇంకొన్ని ఫన్నీ సీన్స్‌ కలగలిసిన షాదీ ముబారక్ ట్రైలర్‌లో పెళ్లి విషయంలో కొంతమంది యువత ఆలోచన విధానం ఎలా ఉంటుందనే అంశాన్ని చాలా బోల్డ్‌గా చూపించారు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని హీరోయిన్‌ని హీరో అడగ్గా... ఏ మాత్రం తడుముకోకుండా సెక్స్ కోసమే అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ విని హీరో మాత్రమే కాదు.. ట్రైలర్ చూసిన ఆడియెన్స్ సైతం నోరెళ్లబెడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Shaadi Mubarak Teaser: షాదీ ముబారక్ టీజర్


సాగర్ ఆర్.కే. నాయుడుకి జంటగా ద్రిశ్య రఘునాథ్ అనే కొత్త హీరోయిన్ జంటగా నటిస్తోంది. తనను పెళ్లి చేసుకోబోయే వాడి ఇంటి పేరు కూడా అందంగా ఉండాలనుకునే అమ్మాయికి NRI Telugu matches లో భాగంగా సున్నిపెంట మాధవ్ అనే అబ్బాయి సంబంధం వస్తే ఎలా ఉంటుందనే కోణంలో కామెడి అల్లుకుంటూ పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కించాడు. Dil Raju నిర్మించిన Shaadi Mubarak movie పై సాగర్ ఆర్కే నాయుడు భారీ ఆశలే పెట్టుకున్నాడు.