Shaakuntalam Collections Vs Virupaksha Collections: సమంత హీరోయిన్ గా మలయాళ హీరో దేవ్ మోహన్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో రూపొందిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాను దిల్ రాజు స్వయంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాని గుణశేఖర్ స్వయంగా తానే నిర్మించగా దాదాపు 80 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా దారుణమైన కలెక్షన్లను రాబడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి ఐదు రోజుల వసూళ్ల వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి.


Also Read: Virupaksha Team: సినిమా హిట్టైంది అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్..థియేటర్కి వెళ్తే దెబ్బేశారు!


తర్వాత నుంచి ఆరవ రోజు ఏడవ రోజు మరింత దారుణంగా ఫలితాలు రావడంతో ఎంత వసూలు చేసిందనే వివరాలు కూడా బయటకు రాలేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమంతా హీరోయిన్ గా రూపొందిన శాకుంతలం సినిమా మొదటి ఐదు రోజుల పాటు వసూలు చేసిన అమౌంట్ కంటే సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమా ఒక్క రోజులో ఎక్కువ వసూళ్లు రాబట్టింది.


సమంత సినిమా వసూళ్ల విషయానికి వస్తే విషయానికి వస్తే ఐదు రోజులకు గాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి రెండు కోట్ల 37 లక్షల షేర్ నాలుగు కోట్ల 70 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా మొదటి రోజు 1.08 కోట్లు, రెండో రోజు 51 లక్షలు, మూడో రోజు 3: 46 లక్షలు, నాలుగో రోజు 20 లక్షలు, ఐదో రోజు 12 లక్షలు, వసూలు చేసింది.


అదే సమయంలో  విరూపాక్ష సినిమా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల 79 లక్షల షేర్, 8 కోట్ల అరవై లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల 35 లక్షల షేర్ 11 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అంటే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ఒకే రోజు సమంత సినిమా ఐదు రోజుల కలెక్షన్లు దాటేసింది. 


Also Read: Samantha Strong Counter: ముసలి ముఖమన్న చిట్టిబాబుకు సమంత స్ట్రాంగ్ కౌంటర్.. అందుకే చెవిలో వెంట్రుకలంటూ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook