Samantha Strong Counter: ముసలి ముఖమన్న చిట్టిబాబుకు సమంత స్ట్రాంగ్ కౌంటర్.. అందుకే చెవిలో వెంట్రుకలంటూ?

Samantha Ruthprabhu Strong Counter: సమంతకి ముసలి ముఖం వచ్చేసిందని ఆమె శకుంతల? ఏంటి అంటూ ప్రశ్నించిన చిట్టిబాబుకు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 21, 2023, 10:45 PM IST
Samantha Strong Counter: ముసలి ముఖమన్న చిట్టిబాబుకు సమంత స్ట్రాంగ్ కౌంటర్.. అందుకే చెవిలో వెంట్రుకలంటూ?

Samantha Ruthprabhu Strong Counter to Producer Chittibabu: నటి సమంత గత కొద్దిరోజులుగా అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. యశోద లాంటి సినిమా చేసిన తర్వాత ఆమె ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందించిన శాకుంతలం సినిమాని దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు.

శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఆసక్తికరంగా తెరకెక్కించి గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో తన ఆరోగ్యం బాగోలేదంటూ సమంత ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ఆమె గురించిన రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉండే నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు అయితే సమంత పరువు తీసే విధంగా మాట్లాడారు. సమంతకి ముసలి ముఖం వచ్చేసిందని ఆమె శకుంతల? ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు.

Also Read: Raviteja's  BYD Atto 3: ఎలక్ట్రిక్ కారు కొన్న రవితేజ.. రేటు తక్కువే కానీ ఫీచర్స్ మైండ్ బ్లాకింగ్ అంతే!

అంతేకాదు జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా నాటకాలు ఆడుతోందని సింపతితో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకుంటుందని అందుకే ఆమె ఎప్పటికప్పుడు తన అనారోగ్యం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది అంటూ చిట్టి బాబు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. అయితే ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఈ విషయం సమంత వరకు చేరినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలా కౌంటర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఆయనకు చెవుల నుంచి వచ్చిన జుట్టు వ్యవహారాన్ని మెన్షన్ చేస్తూ ఆమె కామెంట్ చేసింది.

జనానికి చెవుల్లో నుంచి కూడా జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్లో  సెర్చ్ చేస్తే డాక్టర్లు టెస్టిరోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అలా జుట్టు బయటకు వస్తుందని భావిస్తున్నారని పేర్కొంది. అంతేకాక ఈఫ్ యు నో యు నో అంటూ ఆమె కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. చిట్టిబాబు గురించి ఆమె కామెంట్ చేస్తోందని, ఆయనకి టెస్టిరోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా పిచ్చిపిచ్చి ప్రేలాపనలు ప్రేలుతున్నాడని అర్థం వచ్చేలా ఆమె కామెంట్లు చేసిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. 

Also Read: Aishwarya Bhaskaran: ప్రముఖ నటికి లైంగిక వేధింపులు.. ''అర్ధరాత్రి వస్తా, చూపిస్తారా'' అంటూ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x