Jawan box office collection Day 11: బాక్సాఫీస్ పై కింగ్ ఖాన్ షారుఖ్ దండయాత్ర కొనసాగుతోంది. పది రోజులు దాటినా జవాన్ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. తొమ్మిది రోజుల్లో రూ.700 కోట్ల మార్కును అందుకున్న జవాన్ తాజాగా రూ.800 కోట్ల మార్కుకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 11 రోజుల్లో రూ. 477 కోట్లు నెట్, రూ.840 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో వేగంగా రూ.800 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న తొలి హిందీ సినిమాగా జవాన్ నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.36.52 కోట్ల నెట్, రూ.70 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలోనే కాదు ఓవర్ససీలోనూ దుమ్మురేపుతుంది. ఈ మూవీ 11 రోజుల్లో మెుత్తంగా 34 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.282కోట్లు) వరకు వసూలు చేసింది. పదో రోజు ఈ మూవీ రూ.31.80 కోట్లు రాబట్టింది. మూవీ కలెక్షన్స్ విషయంలో షారుఖ్ తన రిక్డారును తనే బ్రేక్ చేశాడు. పఠాన్ చిత్రం 10 రోజుల్లో రూ.729 కోట్లు వసూలు చేస్తే.. జవాన్ అన్నే రోజుల్లో రూ.797 కోట్లు కలెక్ట్ చేసింది. 


షారుఖ్ హీరోగా నటించిన జవాన్ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. ఇందులో షారుక్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. సీనియర నటి ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుథ్ రవిచందర్ అందించిన సంగీతం మూవీకి ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మించారు.  


Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook