Shah Rukh Khan's Jawan Updates: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం జవాన్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బజ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నరాు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కెర్లు కొడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జవాన్ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్ రూ. 250 కోట్లకు విక్రయించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఇదే గనుక నిజమైతే బాలీవుడ్ చరిత్రలో ఇదే అత్యధికం. అంతేకాకుండా ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ మెుత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళ వెర్షన్ రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా విడుదల కానుంది. ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ ఏకంగా 36 కోట్లకు బాలీవుడ్ టీ సిరీస్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. జవాన్ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 


అయితే ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ షూటింగ్ లో షారుఖ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఓ సీన్ చిత్రీకరణ సమయంలో ఆయన ముక్కుకు గాయమైంది. రక్తం స్రావం ఎక్కువ కావడంతో ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు కూడా వైద్యులు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. 


Also read: Also Read: Shah Rukh Khan: రికార్డు ధరకు షారుఖ్ 'జవాన్' నాన్ థియేట్రికల్ రైట్స్.. బాలీవుడ్ చరిత్రలో ఇదే అత్యధికం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook