జెర్సీ హిందీ రీమేక్ లో నటిస్తోన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor ) ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) హిందీ వర్షన్ కబీర్ సింగ్ లో నటించిన షాహీద్ మంచి విజయాన్ని సాధించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


దాంతో జెర్సీ మూవీ కోసం తన పారితోషికాన్ని రూ.33 కోట్లకు ఫిక్స్ చేశాడు. దాంతో పాటు లాభాల్లో వాటా కూడా అడిగాడు. దీనికి నిర్మాతలు కూడా అంగీకరించారు. 


కరోనావైరస్ కు ( Coronavirus ) ముందు ఈ డీల్ జరిగింది. లాక్ డౌన్ వల్ల ఏర్పడిన పరిణామాల వల్ల సినిమా బడ్జెట్ లో నిర్మాతలు కోతలు విధించారు. అందులో భాగంగానే షాహద్ కపూర్ కూడా పారితోషికం తగ్గించుకున్నాడు. తన ఫీజులో రూ.8 కోట్లు తగ్గించుకోవడానికి షాహీద్ అంగీకరీంచాడు. దీంతో జెర్సీ మూవీకి హిందీ అర్జున్ రెడ్డి రూ. 25 కోట్లు మాత్రమే తీసుకోనున్నాడు. కాగా టాలీవుడ్ లో కూడా నటీనటులు, టెక్నీషియన్లు ఎవరైతే రూ.5 లక్షల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటారో.. వారు 20 శాతం ఫీజు తగ్గించుకోవడానికి అంగీకరించారు.



ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం


నానీ హీరోగా వచ్చిన జెర్సీ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR