Ram Charan Game Changer Climax రామ్ చరణ్‌ శంకర్ గేమ్ చేంజర్ సినిమా మీద నేషనల్ వైడ్‌గా క్రేజ్ నెలకొంది. రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, రామ్ చరణ్‌ స్పెషల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్, ఇండియన్ 2 సినిమాలకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగిపోయిన ఇండియన్ 2 సినిమా విక్రమ్ హిట్టుతో మళ్లీ లైన్‌లోకి వచ్చింది. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ 2 మూవీ ఆగిపోవడంతో.. శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టాడు. అలా రామ్ చరణ్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా అనూహ్యంగా నాలుగు వందల కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో మళ్లీ ఇండియన్ 2 సినిమాను లైన్‌లో పెట్టాడు. దీంతో నెలకు సగం రోజులు గేమ్ చేంజర్.. మిగిలిన సగం రోజులు ఇండియన్ 2 సినిమాకు పని చేస్తున్నాడు శంకర్.


 



మొన్నటి వరకు తైవాన్, సౌత్ ఆఫ్రికా అంటూ ఇండియన్ 2 కోసం శంకర్ షూటింగ్‌ చేశాడు. ఆ తరువాత రామ్ చరణ్‌ గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్‌ను భారీ ఎత్తున షూట్ చేశాడు. ఇప్పుడు ఆ క్లైమాక్స్‌కు సంబంధించిన షూటింగ్ ముగిసిందని, మళ్లీ వెంటనే ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు.


Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్


సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్ షూటింగ్ అంటూ శంకర్ ఓ అప్డేట్ ఇచ్చాడు. మొత్తానికి రెస్ట్ తీసుకోకుండా శంకర్ ఈ రెండు సినిమాలకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గేమ్ చేంజర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించాలనే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్‌ను మాత్రం శంకర్ ఇంకా ప్లాన్ చేసినట్టుగా కనిపించడం లేదు.


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook