Justice for Sushant forum: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) మరణం తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం ( Nepotism ) గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. బడా నిర్మాతలు, మేకర్స్  ట్యాలెంట్ కన్నా రిఫరెన్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై ప్రముఖ హిందీ నటుడు శేఖర్ సుమన్  ( Shekhar Suman ) జస్టిస్ ఫర్ సుశాంత్  (  Justice for sushanth ) పేరిట ఓ ఫోరంను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'' సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనక ఉన్న అసలు  కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేపట్టాలి. ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నేను #justiceforsushant అనే ఫోరంను ఏర్పాటు చేస్తున్నాను. బాలీవుడ్‌లో గ్యాంగ్ ఇజంను ముక్కలు చేయడానికి మీ అండను కోరుతున్నాను'' అని ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.